12-05-2025 03:14:40 AM
రూ.3.లక్షల50 అందజేత
మహబూబబాద్, మే 11 (విజయ క్రాంతి): అకాల మృత్యువాత పడ్డ స్నేహితుని పిల్లలకు స్నేహితులతో పాటు గ్రామస్తులు కలిసి 3.50 లక్షల రూపాయలు అందించి ఆర్థికంగా అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన కంది సుమన్ ఇటీవల మరణించాడు.
బడి వాడ కు చెందిన వారు 67 వేలు, వీరన్న గుడి బజారు 18,500 , పదో తరగతి మిత్రులు 60 వేలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నుంచి 35 వేలు అందజేశారు. ఈ మేరకు సుమన్ కుమార్తెలు నైతిక, ప్రహస్తిని చతుర్వేది పేర్లపై తలా 1.75 లక్షల రూపాయలను పికస్డ్ చేసి బ్యాంకు డిపాజిట్ పత్రాలను అందజేశారు.