25-12-2025 01:59:34 AM
ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్ బంజారహిల్స్ రోడ్ నంబర్ 1 లో హేమాద్రి గ్రాండ్ హోటల్‌ను మహబూబ్‌నగర్ ఎంపీ డాక్టర్ డీకే అరుణ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరా బాదులో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా హోటల్స్ సంఖ్య పెరగాల్సిన అవస రం ఉందన్నారు. నిర్మాణ సంస్థలు ఎక్కువగా ఉండాలని చెప్పారు. నమ్మకంగా నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు ఏర్పాటు చేయాలని ఆమె నిర్వాహకులని కోరారు.
హేమాద్రి హోటల్ నిర్వాహకులు రాజావర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ వన్‌లో నెక్స్ కేర్ హాస్పిటల్ పక్కన హేమాద్రి గ్రాండ్ హో టల్ 3 స్టార్ ప్రాపర్టీ మొదటి బ్రాంచ్ ప్రారంభించామని చెప్పారు. ఇప్పటి కాలంలో అందరూ రెస్టారెంట్స్ కి భోజనానికి వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది కానీ తమ దగ్గర నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని, భోజన ప్రియులు ఆస్వాదించా లని కోరారు.
ఇక్కడ పక్కాగా ఆర్గానిక్‌గా ఉండే గోదావరి ప్రత్యేకతలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. తమ వద్ద అనుభవం గల వంట మాస్టర్లు, మెయింటెనెన్స్ సిబ్బం ది, క్వాలిటీలో ఎక్కడే కానీ కాంప్రమైస్ కానీ మేనేజ్మెంట్ ఉందన్నారు. ముఖ్యంగా నెలలో వారం రోజులపాటు గోదావరి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రారంభోత్సవానికి వచ్చిన ఎంపీ డీకే అరుణకు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.