calender_icon.png 25 December, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లాపూర్‌లో అభివృద్ధి పనులు ప్రారంభం

25-12-2025 01:58:47 AM

ఉప్పల్ డిసెంబర్ 24 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో అభివృద్ధి ద్యేయం గా అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నామని ఉప్పల్ శాసనసభ్యు లు బండారు లక్ష్మారెడ్డి అన్నారు. బుధవా రం రోజున మల్లాపూర్ డివిజన్లోని బాబా నగర్ హనుమాన్ నగర్‌లో 75 లక్షల రూ పాయలతో సిమెంటు నిర్మాణ పనులుఆయన స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేంద ర్‌రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ బిఆర్‌ఎస్ నాయకులు సాయి జెన్ శేఖర్ తో కలిసి శంకుస్థా పన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. రోడ్లు మంచి నీరు ఇతర ఏ సమస్యలున్నా తమ దృష్టి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తూచా తప్ప కుండా నెరవేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనుల నిధులు మంజూ రు చేయించినందుకు కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జలమండలి డిజిఎం సతీష్ ఏ ఈ సిరాజ్ ఇంజనీర్ డిఈ రూప ఏఈ స్రవంతి తదితరులు పాల్గొన్నారు