29-01-2026 01:01:40 AM
మాగనూరు జనవరి 28: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న శ్రీనివాసులు జనవరి 26.గణతంత్ర వేడుకల్లో కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు తీసుకున్నందుకు బుధవారం మాగనూరు మండల సర్పంచులు శాలువా పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మాగనూరు మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న శ్రీనివాసులు సిబ్బందితో, లబ్ధిదారులతో ,ప్రజలతో మమేకమై తనదైన స్నేహభావంతో ప్రభుత్వం ఆదేశాలనుసారము పనులు చేయడంతో ప్రభుత్వ ఉన్న అధికారులు గుర్తించి ఉత్తమ అవార్డు ఇవ్వడం చాలా సంతోషకరమన్నారు. మునుముందు కూడా అనే ప్రత్యేక అవార్డులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉజ్జల్లి సర్పంచ్ రంగారెడ్డి, వడ్వా టు సర్పంచ్ రవీందర్, బైరంపల్లి సర్పంచ్ అంపన్న, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్, శివరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.