05-12-2024 02:16:47 PM
పంచాయతీల విలీనంపై పిటిషన్లు కొట్టివేత
హైదరాబాద్: పురపాలకాల్లో పంచాయతీల విలీనంపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు గురువారం కొట్టివేసింది. పంచాయతీలను విలీనం చేయడాన్ని పిటిషనర్లు సవాల్ చేశారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విలీనం జరిగిందని హైకోర్టు తెలిపింది. పాలనలో భాగంగా చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉందని కోర్టు చెప్పింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని 51 గ్రామ పంచాయతీల విలీనంపై పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు తీర్పుతో పురపాలకాల్లో పంచాయతీల విలీనానికి మార్గం సుగమం అయింది. కాగా, 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలతో విలీనం చేయడం ద్వారా పట్టణ ప్రాంతాన్ని ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) అంతకు మించి విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.