calender_icon.png 13 September, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ సర్పంచ్‌లను హతమార్చిన మావోయిస్టులు

05-12-2024 02:02:11 PM

బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా బస్తర్ డివిజన్‌లోని రెండు ప్రాంతాల్లో అపహరణకు గురైన ఇద్దరు మాజీ సర్పంచ్‌లు శవమై కనిపించగా, మృతదేహాల దగ్గర కొన్ని నక్సలైట్ల కరపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ ఉదయం భైరామ్‌గఢ్, నైమెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పర్సా సుక్లూ, సుఖరామ్ అవలం మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, నక్సలైట్లు సోమవారం బిరియాభూమి గ్రామం నుండి పర్సాను అపహరించి, బుధవారం హత్య చేసినట్లు అధికారి తెలిపారు. బుధవారం రాత్రి నక్సలైట్లు మృతదేహాన్ని గ్రామ సమీపంలో పడేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలంలో లభించిన కరపత్రంలో, భైరామ్‌గఢ్ ఏరియా మావోయిస్టుల కమిటీ పర్సా హత్యకు బాధ్యత వహించిందని అతను అధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యకర్తగా చురుకుగా ఉన్నాడని పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. నక్సలైట్లు కూడా ఆ ప్రాంతంలోని బిజెపి కార్యకర్తలను బెదిరించారని, తీవ్ర పరిణామాలు ఉంటాయని, వారిని పార్టీ నుండి వైదొలగాలని కోరారు.

పర్స కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ సర్పంచ్ మంగళవారం ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అతని కుటుంబ సభ్యులు వెంటనే భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. అతని కుమార్తె తన తండ్రిని వదిలేయాలని విజ్ఞప్తి చేసిన కనికరం చూపలేదు. బుధవారం ముర్గా బజార్ నుంచి సుఖ్‌రామ్‌ కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు ఏఎస్పీ చంద్రకంచ గవర్ణ తెలిపారు. మాజీ సర్పంచ్ సుఖ్‌రామ్ అవలం బీజాపూర్‌లోని శాంతి నగర్‌లో నివసించారు. వ్యవసాయ పనుల కోసం తన స్వగ్రామమైన కడేర్‌కు వెళ్లారు. తిరిగి వస్తుండగా, ఇద్దరు వ్యక్తులు అతన్ని కైక గ్రామం సమీపంలో ఆపి అడవికి తీసుకెళ్లారు. అతని మృతదేహం స్వాధీనం చేసుకున్నాము. ఈ ఘటనలకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్పీ పేర్కొన్నారు. బీజాపూర్‌తో సహా ఏడు జిల్లాలతో కూడిన రాష్ట్రంలోని బస్తర్ డివిజన్‌లో ఈ సంవత్సరం ఇప్పటివరకు నక్సలైట్లు కనీసం 55 మందిని చంపినట్లు పోలీసులు తెలిపారు. జనవరి 2022, ఏప్రిల్ 2023 మధ్య డివిజన్‌లో వేర్వేరు సంఘటనలలో తొమ్మిది మంది బిజెపి నాయకులు చంపబడ్డారు.