27-09-2025 01:18:12 AM
జనగామ, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ప్రోహిబిషన్ అధికారి కార్యాలయంలో డిపిఈఓ ,అనిత ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో, డిపిఈఓ అనిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం 2025-2027 సంవత్సరాలకు గాను నూతన మద్యం పాలసీ ప్రకటించడం జరిగినది. అని మద్యం దరఖాస్తుల స్వీకరణ 18-10-2025 వరకు జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు.
దీనికిగాను మూడు లక్షల, రూపాయల డిడి చలాన్ ద్వారా దరఖాస్తు ఫారంతో సమర్పించవలెను అన్నారు. గౌడ, ఎస్సీ, ఎస్టీ, దరఖాస్తు దారులు కంపల్సరీ కులము, ధ్రువీకరణ పత్రం సమర్పించాలి అని తెలిపారు. ప్రతి దరఖాస్తుదారుడు మూడు పాస్పోర్ట్ సైజ్, ఫోటోలు ఆధార్ కార్డు, జతపరచాలి అన్నారు. ఇట్టి దరఖాస్తుల డ్రా 23-10-2025 రోజున నందన గార్డెన్లో కలెక్టర్, ఆధ్వర్యంలో డ్రా తీయబడుతుంది. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ ప్రభావతి, ఎస్త్స్ర జనార్ధన్, కానిస్టేబుల్ ఖలీల్ ,మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.