27-09-2025 01:18:28 AM
- సీల్ కవర్లలో రిజర్వేషన్లు భద్రం
- మరో రెండు రోజుల్లో ప్రకటనకు అవకాశం
- జిల్లాలో 260 సర్పంచ్, 2268 వార్డు సభ్యులు
- 12 ఎంపీపీ, జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలు
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశావా హులో ఉత్కంఠస్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సర్పంచ్, వార్డు సభ్యులు, పరిషత్ల ఓటర్ల తుది జాబితాలు వెల్లడించారు. ఇదే క్రమం లో స్థానిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన రిజర్వేషన్ల ప్రక్రియ మూడు రోజులుగా కలెక్టర్ నేతృత్వంలో అత్యంత గోప్యంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.
బుధవారం ఉదయం మిగిలిన వార్డుల రిజర్వేషన్లు కూడా పూర్తిచేసి సీల్ కవర్లో భద్రపరిచి ఉం చారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పం చ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఆయా కులాల నిష్పత్తి ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టారు. 2024 సంవత్సరంలో చేపట్టిన కులగణన ప్రకారం 42 శాతం బీసీ రిజర్వేషన్లు, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.
రిజర్వేషన్లపై నేతల ఆరా..
స్థానిక సంస్థల రిజర్వేషన్ల ప్రక్రియపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యం త్రాంగం పూర్తిచేస్తున్న క్రమంలో వివిధ పా ర్టీల నాయకులు ఆశావహులు ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచ్ రిజర్వేషన్లు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. అధికా రికంగా ప్రకటించే వరకు గోప్యంగా ఉంచాలని ఎవరైనా రిజర్వేషన్లు లీక్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు ప్రభుత్వం అధికారులకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో అత్యంత గోప్యంగా రిజర్వేషన్ల ప్రక్రియను చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 జడ్పీటీసీలు, ఎంపీపీలు, 123 ఎంపీటీసీలు, 260 సర్పంచులు, 2268 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 2019 రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తాజా లెక్కల ప్రకారం రిజర్వే షన్ల ప్రక్రియను పూర్తి చేశారు. వంద శాతం ఎస్టీలు ఉన్న గ్రామాలు మళ్లీ వారికే రిజర్వేషన్లు చేసినట్లుగా తెలిసింది.
ఆశావహుల్లో టెన్షన్..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వెళుతున్నట్లుగా ప్రభుత్వ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం అదే క్రమంలో దసరాలోపే షెడ్యూల్ విడుదలకు అవకాశం ఉండడంతో రిజర్వేషన్లపై ఆశావహులు టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియామక పదవులు దక్కకుండానే రెండేళ్లు గడిచిపోయింది. ఈక్రమంలో స్థాని క సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కలిసి వస్తే పదవులు దక్కుతాయని ఆశతో ఉన్నారు. ఇప్పటికే గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కసరత్తు ప్రారంభించారు. రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయనే ఉత్కంఠ మాత్రం జిల్లావ్యాప్తంగా మొదలైంది.
2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సమయం లో జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉండగా, 252 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీసీలకు 56 స్థానాలు, ఎస్సీలకు 51, ఎస్టీలకు 30, జనరల్ స్థానాలు 115 రిజర్వ్ చేశారు. జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 12 జడ్పీటీసీ స్థానాల్లో అరు జనరల్ స్థానాలు, బీసీలు రెండు, ఎస్సీలు మూ డు, ఎస్టీలు ఒకటి రిజర్వ్ చేశారు. 123 ఎంపీటీసీ స్థానాల్లో జనరల్ స్థానాలు 64, బీసీ లకు 25, ఎస్టీలకు 6, ఎస్సీలకు 28 స్థానాలు రిజర్వ్ చేశారు. ఇప్పటికే ప్రకటించిన ఓటరు జాబితా ప్రకారం రాజన్న సిరిపిల్ల జిల్లాలో ఓటర్లు 3 లక్షల 53 వేల 351 మంది ఉ న్నారు. ఇందులో పురుషులు 170772 మంది, మహిళలు 182559 మంది ఉన్నా రు. ఇందులో పురుషులకంటే మహిళా ఓట ర్లు 11787 మంది అధికంగా ఉన్నారు.