calender_icon.png 27 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు

27-09-2025 01:16:26 AM

- తెలంగాణ మట్టిలోనే పోరాటతత్వముందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనం

- రాష్ట్ర ప్రభుత్వ విప్‌ఆది శ్రీనివాస్

కోనరావుపేట సెప్టెంబర్ 26 (విజయక్రాంతి):భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచా కిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన తెగువ,పౌరుషం తెలంగాణ ఆత్మగౌ రవాన్ని,ధిక్కార స్వభావాన్ని చాటి చెప్పాయని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాస నభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో మండల రజ క సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐలమ్మ 130 వ జయంతి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు..వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బం గా వారు మాట్లాడుతూ ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరాని కి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు.100 సంవత్సరాల క్రితం సబ్బండ వర్గాల కోసం అనేక పోరాటాలు చేసిందని, జమీందారుల కు పెత్తందార వ్యవస్థకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటమే నేడు చరిత్ర పుటల్లో వారి పేరు స్థిరస్థాయిగా నిలిచేలా చేసిందని అన్నా రు.గత ప్రభుత్వం పోరాట యోధులను ఎక్కడ కూడా గుర్తిచలేదన్నారు..రాష్ట్ర ప్రభు త్వం వారి పోరాటం బావి తరలకు తెలిసేలా కోటి మహిళ విద్యాలయానికి చాకలి ఐల మ్మ పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.

బీసీలకు రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయడం ఒక చారిత్రాత్మక నిర్ణయం.

వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎల్లవేళలా ఉంటుందని, తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేయాలనీ రాహులు గాంధీ ఆలోచనను ప్రజా ప్రభు త్వం అమలు చేసిందన్నారు.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర,భారత్ జోడో యాత్ర చేసి దేశ ప్రజల ఆకాంక్షలను రాహుల్ గాంధీ తెలుసుకున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని నాడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్కు అనుగుణంగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఆర్థిక, ఉద్యోగ రాజకీయ, కుల సర్వే ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు..దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక రోల్ మోడల్ గా ఉందన్నారు..ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, కాం గ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, ఫ్యాక్స్ చైర్మన్ బండ నరసయ్య యా దవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మాందాల లింబయ్య, ప్రభాకర్ రెడ్డి, అజీమ్ పాషా, ప్యాక్స్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చేపూరి గంగాధర్, యూత్ మండల అధ్యక్షులు బండి ప్రభాకర్,మండల ఉపాధ్యక్షులు ముదాం ప్రదీప్, బిజెపి మం డల అధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ, మాజీ ఎంపీటీసీ దేవరకొండ నరసింహ చారి, బుర్ర రవితేజ గౌడ్, బొర్ర రవీందర్,రజక సంఘం గ్రామ అధ్యక్షులు జింక కర్ణాకర్ మండల అధ్యక్షులు చంద్రయ్య, సంఘ స భ్యులు పొన్నం పరశురాములు, జింక వెంక టి, నేరల లింగయ్య, పొన్నం రాములు, రాజ య్య, కాంగ్రెస్ నాయకులు రస రవీందర్ రెడ్డి, మంగినిపెల్లి శంకర్,సదానందం, శోభన్ బాబు, శంకర్ గౌడ్,బోయిని లింబయ్య, కార్తీక్, తదితరులు పాల్గొన్నారు.