calender_icon.png 6 August, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలి

06-08-2025 01:21:36 AM

అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ డిమాండ్

ముషీరాబాద్, ఆగస్టు 5(విజయక్రాంతి):  హైకోర్టు ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిం ది. కొంపల్లి శివారు గ్రామం, పేట్ బషీర్ బాగ్ సర్వేనం. 25/1,25/2,93లో గల 254 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ అధికారులతో విచారణ జరిపించి న్యాయం చేయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ సలహాదారు మహ్మద్ జమీల్ అమ్మద్ కోరారు.

సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీర్ కౌసర్ అలీ వంశస్తులతో కలిసి ఆయన మాట్లాడారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, కొంపల్లిల్లో సర్వే నం. 104,104 లలో 254 ఎకరాల భూమి తమ పూర్వికుల నుండి సంక్రమించిన స్థిరాస్తి అని, అయితే కొన్ని కారణాల వల్ల కొంపల్లి శివారు గ్రామం, పేట్ బషీర్ బాగ్ సర్వే నెం. 25/1,25/2,93కు మార్చారని తెలిపారు. భూమికి సంబందించిన అన్ని పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.

ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. ఈ భూమిపై మీర్ కౌసర్ అలీ వారసులు పొజిషన్‌లో ఉన్నప్పటికీ ప్రభుత్వాధికారులు హైకోర్టు ఆదేశాలు దిక్కరిస్తూ హెచ్‌ఎండిఏ అధికారులు పోలీసుల అండతో తమ భూమిని స్వాధీనం చేసుకొని కంచె వేసేందుకు జెసిబిలతో పనులు ప్రారంభించారని వెల్లడించారు.

ఈ భూమి ప్రభుత్వానిదం టూ అధికారులు బెదిరంపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. హైకోర్టులు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం విచారణ జరిపించి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మీర్ కౌసర్ అలీ వంశస్తులు మీర్ కౌసల్ అలీ, అప్రోజ్ అలీ, ఆమ్ జాద్ ఖాన్, యాసీన్ పాషా, మీర్ అగ్బర్ తదితరులు పాల్గొన్నారు.