15-12-2025 02:10:12 AM
వేములవాడ, డిసెంబర్ 14,(విజయ క్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రభుత్వ సేవలన్నింటికీ ఇప్పుడు ఒకటే అడ్డంకిగా మారింది సర్వర్. ముఖ్యంగా రేషన్ పంపిణీలో తర చూ తలెత్తుతున్న సర్వర్ సమస్యలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎ దుర్కొంటున్నారు. సర్వర్ లేదు అన్న మా ట లబ్ధిదారులకు రోజువారీ జీవితాన్ని నిలిపివేసే శాపంగా మారుతోంది.
డిజిటల్ విధానం& కానీ డిజిటల్ దుస్థితి
ప్రభుత్వం అత్యాధునిక సాంకేతికత పేరు తో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్, ఆన్లైన్ వ్యవ స్థ రేషన్ దుకాణాల వద్ద భారంగా మారింది. సర్వర్ స్పందించకపోతే రేషన్ పంపిణీ పూ ర్తిగా నిలిచిపోతుండటంతో లబ్ధిదారులు రోజులు తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
తెల్లవారుజామునే క్యూలు సాయంత్రం నిరాశ
రేషన్ దొరుకుతుందన్న ఆశతో లబ్ధిదారులు ఉదయం ఆరు గంటల నుంచే దుకా ణాల వద్ద క్యూల్లో నిలుస్తున్నారు. కానీ గం టల తరబడి వేచి ఉన్నా చివరికి సర్వర్ డౌన్ అన్న సమాధానంతో ఖాళీ చేతులతో తిరిగి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆహార భద్రతపై భయం నెలకొంటోంది.
డీలర్లు లబ్ధిదారుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతసర్వర్ సమస్యలతో రేషన్ డీలర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.ఇంటర్నె ట్ ఉన్నా సర్వర్ పనిచేయదు. ప్రజలు మాపై నే కోపం చూపుతున్నారు. మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితి అని ఒక డీలర్ ఆవేదన వ్యక్తం చేశాడు.రేషన్ షాపులే కాదు& అ న్ని శాఖల్లో అదే కథరేషన్ పంపిణీతో పాటు మీసేవా కేంద్రాలు, ఆధార్ అప్డేట్ కేంద్రా లు, రెవెన్యూ కార్యాలయాలు, రవాణా శాఖ, ఆరోగ్య శాఖ పోర్టల్స్& ఏ శాఖ చూసినా సర్వర్ సమస్యలే. ప్రజలు పని కోసం వెళ్లి ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి రావడంతో సమయం, డబ్బు వృథా అవుతోంది.
సాంకేతిక లోపాలే ప్రధాన కారణమా?
ఐటీ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం పెట్టుబడులు పెడుతున్నామని చెబుతున్నా, సర్వర్ సామర్థ్యం తక్కువగా ఉండటం, బ్యాక ప్ సిస్టమ్లు లేకపోవడం, పీక్ అవర్స్లో లోడ్ హ్యాండ్లింగ్ వైఫల్యం వంటి కారణాలతో వ్య వస్థ తరచూ కుప్పకూలుతోంది.ప్రజలు కోరేది పరిష్కారం మాత్రమే సర్వర్ డౌన్ ఉ న్నా రేషన్ అందించే ప్రత్యామ్నాయ విధా నం అమలు చేయాలి.సర్వర్ల సామర్థ్య పెంపు దిశగా కృషి చేయాలి. ముందస్తు సమాచారం ఇచ్చే వ్యవస్థను రూపొందించాలి.
నమ్మకం కోల్పోతున్న డిజిటల్ పాలన
పేదలకు అండగా ఉండాల్సిన సంక్షేమ పథకాలు సాంకేతిక లోపాల కారణంగా ప్రజలను నిస్సహాయులుగా మారుస్తున్నా యి. డిజిటల్ పాలన ప్రజలకు ఉపయోగపడాలంటే అది విశ్వసనీయంగా పనిచేయా ల్సిందే.ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో సర్వర్ సమస్య ప్రజల జీవితాలకు పెద్ద సమస్యగా మారింది.