05-12-2025 12:00:00 AM
హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): చేనేత కళలను పరిరక్షించుకో వాలని, భారతీయ సంస్కృతిలో చేనేత వృ త్తులు ప్రధాన భూమిక పోషిస్తాయని తెలంగాణ హ్యాండ్లూమ్ టెక్స్‌టైల్స్, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్ అన్నారు. గురువారం శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన సిల్క్ ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.
ఇండియన్ సిల్క్ గ్యాలరీలోని చీరలు కళాత్మక నైపుణ్యానికి, నాణ్యమైన పట్టు ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయని అన్నారు. దేశంలో 14 రాష్ట్రాలకు చెందిన చేనేతకళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. ఇక్కడి చీరలు మహిళలకు ఆకట్టుకుంటాయని, చేనేతకారులకు ప్రతిఒక్కరూ ప్రోత్స హించాలని, ఇండియన్ సిల్యాలరీలో చీరలను మహిళలు సందర్శించి చేనేతకారుల పనితీరును తిలకించాలని కోరారు.
దేశంలోని అన్నిప్రాంతాల చేనేతకారులకు ఒక చోట చేర్చి వారి ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందిస్తున్న నిర్వాహకులు శ్రీనివాసరావు, వినయ్ కుమార్ లను ప్రశంశించారు. రానున్న క్రిస్మస్, సంక్రాంతి, పలు శుభకార్యాలకు అనువుగా పోచంపల్లి, మదనపల్లి, గద్వాల, వెంకటగిరి, చెందేరి, ఇక్కత్, బెనారస్, కొలకతాతో పాటు పలు నగరాలకు చెందిన విభిన్నమైన, అరుదైన చీరలను స్టాల్స్లో ఏర్పాటుచేశామన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ సహకారంతో చేనేతకారుల ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో 80 స్టాల్స్ వినియోగ దారులకు ఈనెల 10వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపారు.