21-11-2025 01:20:40 AM
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్ విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని, కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కక్షపూరితంగా చంపుతోందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ర్టంలో నక్సల్స్ దాడులు, హింసతో నాశనమైన కుటుంబాలు అనేకంగా ఉన్నాయని, మాజీ స్పీకర్ శ్రీపాదరావు, చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యానాయక్ వంటి నేతలను కూడా మావోయిస్టులే చంపారని, ఈ సంఘటనలను మర్చిపోయా రా..? ఇప్పుడా నక్సల్స్‌ను ‘పేదల కోసం పోరాడిన వారు’ అని చెప్ప డం దుర్మార్గం, సిగ్గుచేటన్నారు. మా జీ ఐపీఎస్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమా ర్ నక్సల్స్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తుంటే.. వెయ్యి ఎలుకలు తిని తీర్థయాత్రకు వెళ్లిన చందంగా ఉందని, గతంలో తానే ఎన్‌కౌంటర్లలో పాల్గొని.. నేడు నక్సల్స్ పట్ల సానుభూతి చూపడం రెండు నాల్కల ధోరణే అన్నారు.
ప్రశ్నించిన కార్పొరేటర్లపై దాడులా?
జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని రాంచందర్‌రావు తెలిపారు. అభివృ ద్ధి పనుల పురోగతి, కేంద్ర నిధుల వి నియోగంపై మేయర్, కమిషనర్ హా జరై వివరణ ఇవ్వాలని బిజెపి కార్పొరేటర్లు న్యాయమైన డిమాండ్ కోరా రని, సమాధానం చెప్పాల్సిన అధికార యంత్రాం గం, పోలీసులను ఉపయోగించి కార్పొరేటర్లపై దాడి చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ధి నిధుల వినియోగం, జీహెచ్‌ఎంసీ పనితీరులో ట్రాన్స్‌పరెన్సీ-, అకౌంటబిలిటీ అడిగినందుకే ఇటువంటి ప్రతీకార చర్యలు తీసుకోవడం అధికార పార్టీ నియంతృత్వానికి నిదర్శనమన్నారు.