calender_icon.png 21 November, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయుధ వ్యాపారి కేసు.. వాద్రాపై ఈడీ ఛార్జిషీట్

21-11-2025 12:42:14 AM

న్యూఢిల్లీ, నవంబర్ 20 : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. బ్రిటన్‌కు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ కేసుతో సం బంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఈ ఛార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో సమర్పించింది. మనీలాండరింగ్‌కు సంబంధించి రాబర్ట్ వాద్రాపై ఇది రెండో ఛార్జిషీట్. ఈ ఏడాది జూలైలో షికోపుర్ భూముల వ్యవహారంలో ఈడీ ఆయనపై ఓ అభియోగ పత్రాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని ఆయుధ వ్యాపారి సంజ య్ భండారీ ప్రాంగణంపై 2016లో ఆదాయ పు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. డిజిటల్ డేటా, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రాబర్ట్ వా ద్రా పేరు వెలుగుచూసిందని, లండన్‌లోని ఓ స్థిరాస్తితో వాద్రాకు సంబంధం ఉందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 ఫిబ్రవరిలో ఈడీ ‘నగదు అక్రమ చలామణి చట్టం’కింద భండారీ తదితరులపై కేసు నమోదుచేసింది.