21-11-2025 12:26:30 AM
హుస్నాబాద్, నవంబర్ 20(విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ చేపట్టిన ‘ఆపరే షన్ కగార్’ దెబ్బకు మావోయిస్టు పార్టీ కేం ద్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న తరుణంలో, ఆ పార్టీ అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియా స్ దేవ్ జీ ఆచూకీపై తీవ్ర చర్చ, గందరగోళం నెలకొంది. ఇటీవల జరిగిన ఎదురుకాల్పులు, ముఖ్యంగా హిడ్మా మృతితో కూడి న ఎన్కౌంటర్ల పరంపర తర్వాత, దేవ్ జీ ప్రాణాలకు ప్రమాదం ఉందనే ఆందోళన ఆయన బంధువుల్లో వ్యక్తమవుతోంది.
బుధవారం జరిగిన ఎదురు కాల్పుల తర్వాత దేవ్ జీ గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. ఆయన పోలీసుల అదుపులో ఉన్నారని లేదా హతమయ్యారని పౌర హక్కుల సం ఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఆంధ్ర పోలీసు ఉన్నతాధికారులు మాత్రం తాము దేవ్ జీని అదుపులోకి తీసుకోలేదని ప్రకటించినప్పటికీ, ఈ ప్రకటన తర్వాతే ఆయన ఆచూకీపై అనుమానాలు మరింత పెరగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంట ర్లో దేవ్ జీ బృందం నుంచి కీలక సభ్యులు అరెస్టవడం లేదా మరణించడం వంటి కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి, దే వ్ జీ గురించి మూడు ప్రధాన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి ఎన్‌కౌంటర్‌లో మరణించారా? రెండోది పోలీసుల అదుపులో ఉన్నారా? (కోర్టులో హాజరుపరచా లన్న కుటుంబ సభ్యుల డిమాండ్ దీనికి బలం చేకూరుస్తోంది) మూడోది అజ్ఞాతంలోకి వెళ్లారా? అనే అనుమానాలు వస్తు న్నాయి. దేవ్ జీ విషయంలో రాబోయే అధికారిక ప్రకటన ఏమై ఉంటోందనని ఆందో ళన చెందుతున్నారు.
మా అన్నకు ఏ హాని తలపెట్టొద్దు
దేవ్ జీ ఏమయ్యారనే అంశంపై ఆయన కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. దేవ్ జీ సోదరుడు తిప్పిరి గంగాధర్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి క్షేమంపై ఆందోళన చెందాడు. ‘మా అన్న తిరుపతిని అరెస్టు చేశారని, ఎన్‌కౌంటర్ అయ్యారని వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏది నిజమో మాకు తెలియదు. ఆయన పోలీసుల అదుపులో ఉంటే ఎలాంటి హాని తలపెట్టకుండా కోర్టులో హాజరుపరచాలి.
ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. గతంలో దేవ్ జీ లొంగిపోవాలంటూ ఆయన తమ్ముడి కూతురు తిప్పిరి సుమ గతంలో బహిరంగ లేఖ రాశారు. ‘ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆమె లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.