calender_icon.png 21 November, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమకొండ బస్టాండ్‌కు ఎమ్మెల్యే నాయిని

21-11-2025 01:19:03 AM

  1. బీఆర్‌ఎస్ నేతల సవాల్ స్వీకరించి, గన్‌మెన్లు లేకుండా ఒంటరిగా సందర్శన
  2. చిరు వ్యాపారులతో మాటామంతి

హనుమకొండ, నవంబర్ 20 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు గురు వారం మీడియా సమావేశంలో మాట్లాడు   తూ హనుమకొండ అభివృద్ధిలో వెనుక ఉం దని, ప్రజలందరికీ న్యాయం చేరిన ఎమ్మెల్యేపై ప్రజలందరూ అసంతృప్తిగా ఉన్నారని, గన్‌మెన్లు లేకుండా దమ్ముంటే బస్టాండు వెళ్లగలవా అని సవాల్ విసిరారు. దీన్ని స్వీకరించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎ మ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. గురువారం హనుమకొండ బస్టాండ్‌కు గన్‌మెన్లు లేకుం డా ఒంటరిగా వెళ్లారు. చిరు వ్యాపారులను పలుకరించి, వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటూ, ప్రజ ల పక్షాన నిలబడ్డానే కానీ, హంగు ఆర్భాటాలకు పోలేదన్నారు. రాజకీయాల్లో దిగజా రుడు పనులు చేస్తూ రాజకీయాలను భ్రష్టు పట్టిచ్చిన రాజయ్య  కూడా తన పనితనాన్ని విమర్శిస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నదన్నారు. గత ప్రభుత్వం కట్టించినప్పటికీ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసు కుని కాలయాపన చేసి లంచగొండులుగా మారింది మీరు కాదా అని నిలదీశారు.