calender_icon.png 21 November, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల అభివృద్ధికి దృఢ సంకల్పం

21-11-2025 01:20:02 AM

-నాబార్డ్ భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మలుస్తోంది 

-నాబార్డ్ ఎర్త్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాం తి) : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు ల అభివృద్ధి కోసం రాష్ర్ట ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం మాదాపూర్ లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసి న నాబార్డ్ మొదటి ఎర్త్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. దేశంలోనే అతి పెద్ద రుణమాఫీలలో ఒకదాన్ని అమలు చేసి, దాదాపు 22 లక్షల కుటుంబాలకు రూ.21,000 కోట్ల ఉపశమనం అందించాం అన్నారు.

నాబార్డ్ లేకపోతే గ్రామీణ భారత్ ఇలా ఉండేది కాదు అన్నారు. ఆధునికీకరణ, సహకార సంస్థల బలోపేతం, వ్యవసాయ డిజిటలైజేషన్, గ్రామీణ భారత పునరుద్ధరణ వెనుక ఉన్న నిశ్శబ్ద శక్తి నాబార్డ్ అని డిప్యూటీ సీఎం అభివర్ణించారు. నాబార్డ్ ఇప్పుడు కేవలం వ్యవసా యానికి మద్దతు ఇవ్వడమే కాదని, భవిష్యత్తు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మలుస్తోంది అని వివరించారు. కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాబార్డ్ చైర్మన్ షాజీ, నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గోవర్ధన్ సింగ్ రావత్  పాల్గొన్నారు.

సింగరేణికి నీతి ఆయోగ్‌లో చోటు

నీతి ఆయోగ్ సంస్థ ఇటీవల ఏర్పాటు చేసి న జాతీయ స్థాయి కీలక ఖనిజ కమిటీలో రాష్ర్ట ప్రభుత్వ సంస్థ సింగరేణికి ప్రముఖ స్థానం కల్పించడం శుభపరిణామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈనెల 19వ తేదీన నీతి ఆయోగ్ ప్రకటించిన జాతీయ స్థాయి కీలక ఖనిజాల గుర్తింపు, అన్వేషణ కమిటీలో సింగరేణి సంస్థకు ప్రాధాన్యతనిస్తూ ఆ సంస్థ సీఎండీని సభ్యుడి గా నియమించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకట నను విడుదల చేశారు. రాష్ర్ట ప్రభుత్వ చొర వతో రాజస్థాన్ విద్యుత్ ఉత్పాధన్ నిగమ్ లిమిటెడ్ తో కలిసి సింగరేణి సంస్థ 2,300 మెగావాట్ల థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పా దనకు కుదుర్చుకున్న ఒప్పందానికి బుధవా రం ఆ రాష్ర్ట క్యాబినెట్ ఆమోదం తెలపడం హర్షణీయమని తెలిపారు.    

రూ. 161 కోట్లు విడుదల చేయండి 

జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలు ౧౬౧కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం ప్రజాభవన్‌లో ఆర్థిక శాఖతో పాటు సంబం ధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.