16-09-2025 12:00:00 AM
నాగల్ గిద్ద, సెప్టెంబర్ 15 : జాతీయ హిం దీ దినోత్సవం సందర్భంగా సోమవా రం నాగల్ గిద్ద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ దినోత్సవం వేడుకలు ఘ నంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయులు కాశీరాం జాదవ్ మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ పరిషత్ లో హిందీ భా షను జాతీయ భాషగా గుర్తించినట్లు, అప్పటి నుంచి హిందీ దివస్ వేడుకలు నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు హిందీ బోధిస్తున్న ఉపాధ్యాయుడు కాశీరాం జాదవ్ కు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శంక ర్, ఉపాధ్యాయులు జ్యోతి, మారుతి, విజేందర్ రెడ్డి, మల్లేశ్వరి పాల్గొన్నారు.