calender_icon.png 16 September, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

16-09-2025 12:00:00 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): తెలంగాణ అంగన్వాడీ టీచర్ అండ్ హెల్పర్స్ యూనియన్, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మినిస్టర్ ల ఇళ్ల ముందు ధర్నా చేయాలని  పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టో లో అంగన్వాడీ మినీ అంగన్వాడి లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇస్తామనిp సౌకర్యం కల్పిస్తామని రిటైర్మెంట్ జీవో నెంబర్ 8 సవరణ కాళీ పోస్టుల భర్తీ 24 రోజుల సమ్మె వేతనం తదితర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ప్రభుత్వ  సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్  కామారెడ్డి లో ఇంటిముందు  అంగన్వాడి టీచర్, ఆయా లు ధర్నా చేశారు.

ధర్నాను ఉద్దేశించి  సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఐసి డిఎస్ తో పాటు విద్య వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కోసం నూతన జాతీయ విద్య విధానం చట్టాన్ని తెచ్చింది. ఇంతటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి భిన్నంగా ఐసిడిఎస్ ను మొత్తం నిర్వీర్యం చేస్తుందన్నారు. 

కనీస వేతన 18000 రూపాయలు ఇవ్వాలి. పిఏపీఎస్సీ సౌకర్యం కల్పించాలి హామీ ప్రకారం వెంటనే జీవో నెంబర్ ఇన్ సవరించాలి, పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ 2024 జూలై 1 నుంచి చెల్లించాలి. మూడు నెలల పిఆర్సి మినీ టీచర్కు 11 నెలల ఏరియాస్ రిటైర్మెంట్ అయిన వాళ్లకు 10 నెలల cb యి బకాయిలు వెంటనే చెల్లించాలి, వెంటనే భర్తీ చేయాలి. సీనియారిటీని బట్టి ఇంక్రిమెంట్ నిర్ణయించాలి ఐసిడిఎస్ మంత్రి  హామీ ప్రకారం కారణ్య నియమకాలు త్వరగా నిర్ణయించాలి..

తదితర న్యాయమైన డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని ప్రభుత్వ  సలహాదారులు షబ్బీర్ అలీ  పిఏ గంగాధర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు.  సిఐటియు జిల్లా నాయకులు ముదాం అరుణ్ కుమార్, అంగన్వాడి యూనియన్ జిల్లా కార్యదర్శి బాబాయి, లక్ష్మి, యాదమ్మ ,సురేఖ, విజయ, సరిత,  సుజాత, సునంద, సిద్దమ్మ, లలిత, సురేఖ, రాణి, కవిత, అలివేలు స్రవంతి, సరస్వతి, ఇందిరా, రాజేశ్వరి, రాణి ,అంగన్వాడీ టీచర్స్, ఆయాలు  పాల్గొన్నారు.