calender_icon.png 5 November, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో రైలుప్రమాదం

05-11-2025 01:29:22 AM

  1. గూడ్స్‌రైలును వెనుక నుంచి ఢీకొట్టిన ప్యాసింజర్

బిలాస్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో ఘటన

ఎనిమిది మంది మృతి.. మరో 15 మందికి పైగా గాయాలు

ప్రమాదంపై విచారణకు ఆదేశించిన రైల్వేశాఖ

సిగ్నల్ వ్యవస్థ విఫలం లేదా మానవ తప్పిదమని ప్రాథమిక అంచనా

రాయ్‌పూర్, నవంబర్ 4: ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ (మెమూ), గూడ్స్ రైలును ఢీకొట్టడంతో ప్ర మాదం చోటుచేసుకుంది. ఘటనలోఎని మిది మంది మృతిచెందగా, మరో 15 మంది కి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు, రెస్క్యూ బృందాలు స్థానిక తరలించి చికిత్స అందిస్తున్నాయి.

క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రైల్వే అధికారులు, స్థానిక యంత్రాంగం స హాయక చర్యలు చేపట్టారు. ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. కలెక్టర్ సంజయ్ అగర్వాల్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, సిగ్నల్ వ్యవస్థ వైఫల్యం లేదా మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ భావిస్తున్నది.

ఛత్తీస్‌గఢ్‌లోని గేవ్రా నుంచి బిలాస్ పూర్ బయల్దేరిన ప్యాసింజర్ రైలు మార్గమధ్యంలో గూడ్స్ రైలును వెనుక నుంచి ఢీకొ ట్టింది. దీంతో ప్యాసింజర్ ముందుభాగం గూడ్స్ బోగిపైకి వెళ్లింది. ప్రమాదంలో ఒక బోగీ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాదం కారణంగా బిలాస్‌పూర్- హౌరా రైలు మార్గం లో రాకపోకలు నిలిచిపోయాయి. పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. రైల్వేశాఖ మరికొన్ని సర్వీసులను దారిమళ్లించింది.

సీఎం దిగ్భ్రాంతి

రైలుప్రమాదంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్‌సాయి ‘ఎక్స్’ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాద ఘటన తనను కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రగాయాల పాలైన వారికి రూ.5 లక్షలు, స్వలంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. ప్రయాణికులు, వారి కుటుంబాల సౌక ర్యార్థం 77778 57335, 78699 53330, 80859 56528 నంబర్లను ఏర్పాటు చేసింది.