calender_icon.png 19 July, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘హిందుత్వ’ అహింసను బోధిస్తుంది

19-07-2025 12:34:26 AM

కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

న్యూఢిల్లీ, జూలై 18: హిందుత్వ అనేది భారతీయ మట్టిలోనే ఉందని, అది అహింసను బోధిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరా జ్ సింగ్ చౌహాన్ అన్నారు. ‘మేము అహింసను నమ్ముతాం. హిందీ చినీ భాయ్ భాయ్ అనుకుంటూ ఉంటే చైనా వచ్చి మన భూమిని ఆక్రమిస్తుంది. దాన్ని బలహీనత అంటారు.

భారత్‌పై దాడి చేసిన ఎవరినీ మేము వదిలిపెట్టడం లేదు. సర్జికల్ స్ట్రుక్స్, ఎయిర్ స్ట్రుక్స్, ఆపరేషన్ సిందూర్ ఇలా సమాధానం చెబుతూనే ఉ న్నాం. అలాంటి సమాధానం చెప్పకపోతే మనుగడ కష్టం’ అని చౌహాన్ పేర్కొన్నారు. 1962 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ ‘హిందీచినీ భాయ్ భాయ్’ అంటూ మన దేశానికి అన్యాయం చేశారని చౌహాన్ విమర్శించారు