calender_icon.png 19 July, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండియా కూటమికి బీటలు

19-07-2025 12:36:47 AM

  1. కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్న ఆప్
  2. ఇండియా కూటమిలో లేమని ప్రకటించిన ఆమ్‌ఆద్మీ

న్యూఢిల్లీ, జూలై 18: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి నేడు సమావేశం కావాలని ఇండియా కూటమి భావించింది. అయితే ఈ సమావేశానికి హాజరు కావొద్దని ఆప్ నిర్ణ యించింది. గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇండియా కూట మితో కలిసి పని చేశాం కానీ ప్రస్తు తం కూటమిలో లేమని ఆప్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ప్రకటన చేశారు.

శనివారం జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడం లేదన్నారు. మరో పక్క తృణముల్ కాంగ్రెస్ మాత్రం నేటి సమావేశానికి హాజరుకావాలని నిర్ణయించింది. ఆ పార్టీ తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హాజరవనున్నారు.