calender_icon.png 6 August, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవా ఇక పరదాలకూ..

06-08-2025 01:14:02 AM

‘సినిమా బండి’ ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుతో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డీకే మద్దతు ఇస్తున్నారు. కథానాయిక అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే రీలిజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌గా ‘ఎగరేయ్ నీ రెక్కలే..’ పాటను రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపర్చిన ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా, రితేష్ జీ రావు ఆలపించారు.

‘ఎగరేయ్ నీ రెక్కలే.. కలిపేయీ ఆ దిక్కులే.. గగనాలే నీ హద్దుగా.. అడుగేస్తూ సాగాలిగా.. సెలవా ఇక పరదాలకూ.. ఎవరాపినా పరుగాపకూ..’ అంటూ సాగుతోందీ గీతం. ఈ పాటలో అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత జర్నీ ఎమోషనల్ అండ్ హార్ట్ టచ్చింగ్‌గా ఉంది. ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు మృదుల్ సుజిత్ సేన్ సినిమాటో గ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకరాల ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.