calender_icon.png 6 August, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిమిటెడ్‌గా వచ్చేసిందే లవ్వూ..

06-08-2025 01:12:14 AM

రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించి, ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది. మొదటి గీతంగా విడుదలైన ‘తు మేరా లవర్’ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు రెండో గీతంగా ‘ఓలే ఓలే’ను విడుదల చేసింది చిత్రబృందం.

‘ధమాకా’ జోడీ రవితేజ ఈ పాటతో మరోసారి ఆకట్టుకుంది. ఇద్దరూ పోటాపోటీగా నర్తించి పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. భీమ్స్ సిసిరోలియో తనదైన శైలిలో స్వరపరిచిన ఈ గీతాన్ని రోహిణి సోరట్‌తో కలిసి ఆలపించారు. ఈ పాటకు భాస్కర్ యాదవ్ దాసరి సాహిత్యం అందించారు. ఆగస్టు 27న విడుదల కానున్న ఈ చిత్రానికి డీవోపీ: విధు అయ్యన్న; కూర్పు: నవీన్ నూలి; ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల. 

అభ్యంతరకరంగా సాకీ.. 

మాస్ జాతర చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌గా మేకర్స్ విడుదల చేసిన ఓలే ఓలే పాటలో కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి. ‘సికాకుళం జిల్లా మొత్తం యెతికి తిరిగి పట్టుకున్న.. యాడనుంచి వచ్చావే సిలకా గిలాకా మొలకా పలకా.. రాయలేక రాసుకున్న రాతలన్ని మారిపోయెనే.. లిమిట్‌ను టచ్చేసిన పిల్లా.. లిమిటెడ్‌గా వచ్చే సిందే లవ్వూ.. ప్రేమ.. కోపం.. మోసం..’ అంటూ ప్రారంభమైందీ గీతం.

అయితే, ఈ పాటకు సంబంధించి సాకీలో చివరగా ఉన్న కొన్ని పదాలు స్త్రీలను అగౌరవపరిచేవిధంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. సాకీలోని మాటలే పాటలోనూ ఉన్నప్పటికీ అవి అభ్యంతరక రంగా లేవు. ఆ మాటల చివర ‘ని’ అనే అక్షరాన్ని చేర్చటంతో అగౌరవపర్చినట్టు అనిపించడం లేదు. అంటే ‘అమ్మని, అక్కని, చెల్లిని పట్టుకొని కాళ్లు మొక్కి పోతా..’ అంటూ కొనసాగే పదాలు మాత్రం విమర్శించేవిధంగా లేవు.