calender_icon.png 6 August, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు దర్శకుడితో అలాంటి కథలో..!

06-08-2025 01:15:56 AM

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఆమె నటించిన ఐటమ్ సాంగ్స్ మాత్రమే. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లోనూ ఆమె నటించిందీ బాలీవుడ్ భామ. ఈ ముద్దుగుమ్మ తెలుగు చిత్రసీమకూ సుపరిచితురాలే. గతంలో తెలుగులో ‘సాహో’ సినిమాలో ఓ ప్రత్యేక గీతంతో ఇక్కడి ప్రేక్షకులను మైమరిపింజేసింది జాక్వెలిన్. అయితే, ఇప్పుడీ బ్యూటీ తెలుగులో నేరుగా ఓ సినిమా చేయబోతోంది. అది కూడా మహిళా ప్రాధాన్య చిత్రం కావటం విశేషం.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రధాన పాత్రలో తెలుగులో రానున్న ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాను దర్శకుడు వీ జయశంకర్ తెరకెక్కించనున్నారు. జయశంకర్ ఇంతకుముందు ‘పేపర్ బాయ్’, ‘అరి’ చిత్రాలతో తన సత్తా చాటారు. ఈ సినిమాకు సంబంధించి యాక్షన్, సస్పెన్స్‌తో కూడిన ఒక ఇంటెన్స్ స్క్రిప్ట్‌ను దర్శకుడు జయశంకర్ ఇప్పటికే జాక్వెలిన్‌కు వివరించారని తెలుస్తోంది.

కథ, తన పాత్ర నచ్చటంతో జాక్వెలిన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జాక్వెలిన్ ఈ సినిమాలో యాక్షన్ లేడీగా కనిపించనుందని సమాచారం. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని అంటున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ను ఫైనల్ చేసే పనిలో ఉన్న డైరెక్టర్ జయశంకర్ త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారని టాలీవుడ్ టాక్.