calender_icon.png 2 August, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి..

01-08-2025 07:08:58 PM

ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి..

దేవరకొండ: భవన నిర్మాణ కార్మికుల చందంపేట మండలం కమిటీ సమావేశం మండల అధ్యక్షులు అందుగుల సైదులు అధ్యక్షతన శుక్రవారం చందంపేటలో జరిగింది. ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి(AITUC District President Noone Ramaswamy) ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... దేశంలో నిర్మాణ రంగాల్లో సుమారుగా ఏడు కోట్ల మంది కార్మికులు పనిచేస్తున్నారని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాడి సంక్షేమ బోర్డును తీసుకురావడం జరిగిందని, యాక్సిడెంట్ డెత్ 10 లక్షలకు పెంచాలని సాధారణ మరణానికి మూడు లక్షలు ఇవ్వాలని కార్మికుల అడ్డాల వద్ద షెల్టర్ల కనీస వసతులు ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు ఇంటి స్థలము మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మొగిళ్ల వెంగలయ్య, అలముని మల్లయ్య, కొమర సైదులు, అందుగుల సైదులు, మాతాంగి, వెంకటయ్య మాడుగుల తదితరులు పాల్గొన్నారు.