calender_icon.png 1 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి

01-10-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 30,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో రెండవ సాధారణ ఎన్నికలు (జడ్పిటిసి, ఎంపీటీసీ , గ్రామ పంచాయతీ) నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలనీ కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపధ్యం లో, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల నిర్వహణపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో మంగళవారం ఐడిఓసి కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించా రు.

ఈ సందర్భంగా జిల్లా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల అభ్యర్థుల ఖర్చుల నమోదు, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తదితర అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందజేశారు. ప్రతి అభ్యర్థి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు.పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించి ప్రతి అభ్యర్థికి సమాన హక్కులు కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు.

రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తన నియమావళిపై వి స్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో జరిగే రాజకీయ సమావేశాలు, సభలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కరపత్రాల పంపిణీ, వీఐపీలు పాల్గొనే బహిరంగ సభలు తదితర కార్యకలాపాలు నిషితంగా పరిశీలించబడతాయని, వాటికి అయ్యే ఖర్చులు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థి ఖాతాలో నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వకుండా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి ముద్రణలు చే యరాదని, ఎన్నికల ఫ్లెక్సీలపై ముద్రిస్తున్న వారి ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు.రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతులు తప్పనిసరి అన్ని పార్టీలు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు.

అలాగే, ఆలయాలు, మసీదు లు, చర్చిలు, ప్రార్థనా స్థలాలలో రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ, ఎన్నికల నిర్వహణపై వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, డిప్యూటీ జెడ్పీ సీఈవో కొండూరు చంద్రశేఖర్, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అజ్మీర సురేష్, భారతీయ రాష్ట్ర సమితి అనుదీప్, సిపిఐ పార్టీ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నోముల ర మేష్, సిపిఐ ( ఎం) సత్యనారాయణ, సిపిఐ ( ఎం సి ) గౌరీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.