01-10-2025 01:00:50 AM
వాజేడు, సెప్టెంబరు30 (విజయ క్రాంతి):ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెద్దగంగారం గ్రామానికి చెందిన మాజోజి నరేందర్ కూతురు(5 నెలలు) ఊపిరితిత్తుల సమస్య మరియు బ్రెయిన్ లో మచ్చలు వచ్చాయి,ప్రస్తుతం పాప పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది.
కోమాలో ఉంది 5లక్షల రూ. ఖర్చు అవుతుందని ఖమ్మంలోని ప్రయివేట్ హాస్పిటల్ డాక్టర్స్ చెప్పినారు వాళ్లకు అంత ఖర్చు పెట్టుకునే స్థోమత లేకపోవడంతో పెద్ద మనసుతో దాతలు సహాయం చేసి మా పాపను కాపాడగలరని దీనస్థితిలో పాప తండ్రి వేడుకోగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న.
‘ముప్పనపల్లి సహాయం నిధి‘ఈ సహాయ నిధి దాతల సహాయంతో ఏంతో మంది కష్టాలను కడతేర్చిన గొప్ప సంస్థ అందుకే మంగళవారం రోజు ఖమ్మం ఓ హాస్పిటల్ లో ఉన్న పాప తండ్రి నరేందర్ కు 22వేల రూపాయలను ముప్పనపల్లి సహాయం నిధి వారు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ నిధి సభ్యులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.