01-10-2025 12:59:58 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): ఆంక్షలను ఎదిరించి, నిర్బంధాలను ఛేదించి, రబ్బర్ బుల్లెట్లకు ఎదురొడ్డి తెలంగాణ ఉద్యమకా రులు స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిన ఉద్వేగభరిత ఘట్టం సాగరహారమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పోరాట రూపాల్లో సాగరహారం ఒకటని గుర్తు చేసుకున్నారు.
ఉద్యమ కారులను అడ్డుకుందామన్న సమైక్య పాలకుల కుట్రలను పటాపంచలు చేస్తూ.. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ‘జై తెలంగాణ’ అని గొంతెత్తి, కవాతు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని చాటిన ఉద్విగ్న సందర్భం సాగరహారం అని పేర్కొన్నారు. మంగళ వారంతో సాగరహారానికి 13 ఏళ్లు అని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.