calender_icon.png 1 October, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటి

01-10-2025 12:42:24 AM

  1. ఎన్నికలకు మోగిన ‘స్థానికం’ సైరన్ పంచవర్ష ప్రణాళికతో పోలింగ్
  2. పల్లెల్లో మొదలైన పంచాయతీ సందడి ఆశావావులకు మిగిలిన నిరాశ
  3. తెరపైకి కొత్త ముఖాలు గెలుపుకై రంగంలోకి కీలక నేతలు

బాన్సువాడ సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసిన ఎన్నికల సైరన్  మోగింది. స్థానికం సమరానికి సన్నద్ధం కావాలని ఎన్నికల కమిషన్ పిలుపునిచ్చింది. మరోవైపు పంచా యతీ పోరుకు పట్టుదలతో కృషి చేయాలని ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. పంచాయతీ పోరుతో పల్లెల్లో ఎన్నికల వేడి కాస్తుంది. నువ్వా నేనా అనే రీతిలో పోటీదారులు సమరానికి సై అంటున్నారు.

జెడ్పిటిసి ఎంపీటీసీ ఎన్నికలను రెండు విడతలుగా నిర్వహించగా, పంచాయతీ ఎన్నికలను మూడు విడుత లగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం అప్పుడే ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సమీక్షలు సమావేశాలతో కలెక్టర్ స్థాయిని మొదలుకొని డివిజన్ స్థాయి అధికారుల వరకు బిజీగా ఉన్నారు.

కాగా, ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్లు కొందరి ఆశావా వులకు నిరాశ మిగిల్చాయి. ఈ దఫా ఎన్నికల్లో తామే పోటీగా ఉంటామని భావించిన వారికి రిజర్వేషన్లు ’నో’ అనే  దిబ్బ కొట్టాయి. జనాభా గణాంకాల ప్రకారం ఈ దఫా ఎన్నికలు అనూహ్య రీతిలో రిజర్వేషన్లు మారిపోయాయి. ఈసారి స్థానికం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

మరోవైపు కమలనాథులు సైతం ప్రధాని మోదీ చరిష్మాతో అనుకూలమైన చోట్లల్ల పాగా వేసే ప్రయత్నం చేస్తు న్నారు. గత మాసం రోజుల నుండి ఎన్నికల  నగరా కోసం వేచి చూసిన వాళ్లంతా ఎన్నికల కమిషన్ నుండి సైరన్ మోగడంతో పలు పార్టీలు తమ పంతాను మొదలుపెట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా 565 జెడ్పిటిసి స్థానాలు, 5749 ఎంపీటీసీ స్థానాలకు గాను రెండు విడతలుగా  ఎన్నికలు జరగనున్నాయి.

అలాగే మూడు విడతలుగా పంచాయతీ పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల్లో 81,65,894 మంది పురుష ఓటర్లు ఉండగా, 85 లక్షల 36,770 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మరో 54 ఇతరుల ఓటర్లు ఉండగా, ఒక కోటి 67 లక్షల 3165 మంది ఓటర్లు పంచాయతీ పూర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి అనుగ్రహాన్ని పొంది విజేతలుగా నిలిచేందుకు అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ బి ఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ సిపిఎం పార్టీలు సమర్థులైన అభ్యర్థుల వేటలో నిమగ్నులై ఉన్నారు. ఆయా ప్రాదేశిక నియోజకవర్గం స్థాయిలో ప్రజల్లో ఎవరెవరికి పట్టుంది అన్న విషయాలను పరిగణలో తీసుకొని వారిని అభ్యర్థు  లుగా రంగంలోకి దింపేందుకు మూడు  పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నారు.

ఇప్పటికే జెడ్పిటిసి ఎంపీటీసీ, ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతోపాటు సర్పంచులకు వార్డు మెంబర్ల స్థానాలకు రిజర్వేషన్లు ప్రకటించింది. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడ జెడ్పిటిసి స్థానం బీసీకి కేటాయించగా, భిక్కనూర్ బీసీకి కేటాయించారు. బిబిపేట్ బీసీ మహిళకు రాగ, బిచ్కుంద అన్ రిజరవ్డ్ కు, బీర్కూర్ అన్ రిజర్వుడుకు కేటాయించారు.

దోమకొండ అన్ రిజరవ్డ్ మహిళకు దక్కగా, డోంగ్లి షెడ్యూల్ క్యాస్ట్ మహిళకు, గాంధారి బిసి మహిళకు కేటాయించారు. కామారెడ్డి ఎస్సి కి కేటాయించగా, లింగంపేట్ బీసీకి కేటాయించారు, మాచారెడ్డి ఎస్టి మహిళకు, మద్నూర్ బీసీ సామాజిక వర్గానికి దక్కింది. మహమ్మద్ నగర్ బీసీ మహిళకు వెళ్లగా, నాగిరెడ్డిపేట్ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. నస్రుల్లాబాద్ అన్ రిజర్వుడు గా కేటాయించగా, నిజాంసాగర్  బీసీ మహిళకు కేటాయించారు.

పాల్వంచ బిసి వర్గానికి పోగా, పెద్ద కొడపుగల్ బీసీకి కేటాయించారు. పిట్లం అన్ రిజర్వుడు మహిళకు కేటాయించగా, రాజంపేట ఎస్టి కి దక్కింది. రామారెడ్డికి బీసీ మహిళకు, సదాశివ నగర్ అన్ రిజర్వుడు మహిళకు కేటాయించారు. తాడ్వాయి అన్ రిజర్వుడు కాగా, ఎల్లారెడ్డికి అన్ రిజర్వుడు మహిళలకు కేటాయించారు . జడ్పిటిసి స్థానాలతో పాటు మండల పరిషత్ అధ్యక్షుల స్థానాల రిజర్వేషన్లు కూడా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లను ప్రకటించింది.

బాన్సువాడ బిక్కనూర్ బీసీలకు కేటాయించగా, బిబిపేట్ బీసీ మహిళకు బిచ్కుంద అన్ రిజరవ్డ్ మహిళకు, బీర్కూర్ అన్ రిజరవ్డ్ మహిళకు, దోమకొండ అన్ రిజర్వుడు , డోంగ్లి ఎస్సీ మహిళకు, గాంధారి బీసీకి కేటాయించారు. జుక్కల్ ఎస్సీకి, కామారెడ్డి ఎస్టీ మహిళలకు, లింగంపేట్ బీసీకి వర్గానికి దక్కింది. మాచారెడ్డి ఎస్ టి మహిళ కు రాగా, మద్నూర్ బీసీ కి వెళ్ళింది. మహమ్మద్ నగర్ బిసి మహిళకు, నాగిరెడ్డిపేట్ ఎస్సీకి కేటాయించారు.

నస్రుల్లాబాద్ అన్ రిజరవ్డ్ మహిళకు,  నిజాంసాగర్ బీసీ మహిళకు కేటాయించగా పాల్వంచ బిసి మహిళ ఖాతాలోకి వెళ్ళింది. పెద్ద కోడప్గల్ బిసి మహిళకు, పిట్లం అన్ రిజర్వ్ కేటాయించగా, రాజంపేట ఎస్టికి కేటాయించారు. రామారెడ్డికి బీసీ మహిళకు సదాశివ నగర్ కు అన్ రిజర్వుడు కేటాయించగా, తాడ్వాయికి అన్ రిజర్వ్ మహిళకు, ఎల్లారెడ్డి అన్ రిజర్వుడుకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లను ప్రకటించింది.

గత ఏడాదికాలంగా చాలా చోట్లలో తామే జడ్పిటిసిలుగా, సర్పంచులుగా పోటీలో నిలిచి గెలుపొందుతామని ఆశతో ఆయా ప్రాంత ప్రజలను మచ్చిక చేసుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసుకున్నారు. ఆలయాలకు విరాళాలు ఇవ్వడం, పర్వదినాల్లో అన్నదానాలు పెట్టడం, సమస్యల్లో ఉన్నవారికి ఆర్థికంగా ఆదుకోవడం, పెళ్లిళ్లకు ఇతరత్రా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఆశావాహులు లక్షల్లో ఖర్చు చేసుకున్నారు.

ప్రస్తుతం రిజర్వేషన్ల దెబ్బ వారి ఆలోచనలు బెడిసి కొట్టింది.  సామాజిక వర్గం ప్రకారం పురుషులకు రిజర్వ్ అవుతాయి అనుకున్న స్థానాలు మహిళలకు రిజర్వు కావడం, బీసీ వర్గానికి దక్కుతాయనుకున్న ప్రాంతాలు ఎస్సీ కోటాలోకి వెళ్లిపోవడం, తమ వర్గానికి వస్తాయనుకున్న ప్రాదేశిక నియోజకవర్గం జనరల్ గా రిజర్వ్ కావడంతో వారి ఆశలపై రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. 

ఇంతకాలం తమ తమ స్థానాల్లో పట్టు సాధించి అభ్యర్థులుగా ఉంటాం అనుకున్న వారు పోటీకి దూరం కాగా బరిలోకి దిగేందుకు ముందుకు వస్తున్నాయి. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని వారు కూడా ఈసారి స్థానికం పంచాయతీ పోరులో అభ్యర్థులుగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.   ప్రజా సమస్యలు, సామాజిక స్పృహ, ప్రగతి అనే అంశాలపై ఏమాత్రం అవగాహన లేని వారు కూడా రిజర్వేషన్ల ప్రక్రియతో ఎన్నికల్లో నిలబడే ఛాన్స్ వచ్చింది.

వారిని బరిలోకి దింపి గెలిపించుకోవాలన్న తహతహ ప్రధాన పార్టీ నేతలు తొలగిసలాడుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో స్థానిక సమరం ఈసారి వాడి వేడిగా సాగనుంది. రాజకీయం రసవత్తరంగా మారి పంచాయితీ పోరులో తాజా మాజీ ఎమ్మెల్యేలు సైతం తమ సత్తాను చాటుకునే పంతంతో ముందుకు కదులుతున్నారు. కామారెడ్డి గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి సురేందర్, నిజామాబాద్ రూరల్ బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ హనుమాన్ షిండే మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో పంచాయితీ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నారు.

ఈ స్థానిక సమరంలోనే తమ పట్టు సాధిస్తే రాబోయే ఎన్నికలకు తమకు అనుకూల వాతావరణం కల్పించుకునే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో అడుగేస్తు న్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో స్పీకర్ గా కొనసాగి అదే పార్టీ జెండాపై ఎమ్మెల్యేగా గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి  తదుపరి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బాన్సువాడ సెగ్మెంట్లో రాజకీయం వేడి హాట్ హాట్ గా కొనసాగుతోంది.

ఈ నియోజకవర్గంపై ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, నిజామాబాదు రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధనలు దృష్టి సారించారు. ఇరువురు నాయకులు సెగ్మెంట్లో తమ తమ అనుచర గణాన్ని పెంచుకునే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు.

గత ఏడాది కాలంగా ఇరువురు మాజీలు తమ ఉనికిని పదులపరుచుకునేందుకు వివిధ కార్యక్రమాల రూపంలో మేమున్నామనే ధీమాను కనబరుస్తూ వచ్చారు. అదే తరుణంలో స్థానిక సమరం, పంచాయతీ ఎన్నికలు రావడంతో కామారెడ్డి జిల్లా నియోజకవర్గాల దృష్టింత బాన్సువాడ సెగ్మెంట్  పైనే పడింది. ఏదేమైనా ఇటు పండుగల వాతావరణం... అటు ఎన్నికల వేడి... ఓటర్లకు మరింత సంబరాన్ని ఇచ్చే విధంగా తయారయింది.