calender_icon.png 1 October, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కోసం విద్యుత్ అధికారుల పొలం బాట

01-10-2025 12:00:00 AM

ఖమ్మం, సెప్టెంబర్ 30 (విజయ క్రాంతి): రైతులకు మరింత ఉత్తమ సేవలు అందించడానికి రైతుల సమస్యలను విని వారి సమస్యలను నేరుగా పరిష్కరించడానికి రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యల పరిష్కార మార్గమే ‘విద్యుత్ అధికారుల పోలం బాట ‘. కార్యక్రమమని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ ఖమ్మం సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజనీర్ ఇ. శ్రీనివాస చారి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రమాద భరితంగా ఉన్న లూజ్ లైన్లు, వంగిన స్థంబాలు , మధ్య స్థంబాలు పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు . ఇప్పటివరకు లూజ్ లైన్లు 447 , వంగిన స్థంబాలు 226, మధ్య స్థంబాలు 374 వేయడం జరిగిందని పేర్కొన్నారు . 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా 1912 టోల్ ఫ్రీ నెంబర్  తీసుకువచ్చామని, ఎటువంటి విద్యుత్ సమస్యల కైనా 1912 లో సంప్రదించి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు.

రైతులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండేందుకు ఎస్టిమేట్ కు సంబంధించిన మెటీరియల్స్ తాలూకు వివరాలు, స్కెచ్ (నక్ష) అన్ని తెలుగులో అందిస్తున్నామన్నారు.ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు  కాలిపోతాయో వాటిని సంస్థ వాహనాల ద్వారా తీసుకొని వెళ్లి మరల రిపేర్ చేసి ట్రాన్స్ఫార్మర్లను తీసుకువెళ్లి పెట్టడం పూర్తిగా ఎన్పీడీసీఎల్ బాధ్యత తీసుకుందని , తమ సొంత వాహనాల ద్వారా తరలింపు ప్రక్రియ చేపడుతున్నామని వివరించారు.ఆహర్నిశలు రైతులకు మెరుగైన , నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని , ఎక్కడ ఇబ్బందులు లేకుండా నిబ్బద్దత్థో పనిచేస్తున్నామని ఈ సందర్భాంగా వివరించారు