calender_icon.png 1 October, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటమ్ సాంగ్స్‌తోనే నాకు ఇంతటి గుర్తింపు

01-10-2025 12:29:55 AM

తమన్నా భాటి టాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్‌డమ్ సంపాదించుకుంది. ఇటీవల హీరోయిన్‌గా సినిమా అవకాశాలు బాగా తగ్గడంతో బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాలను ఓకే చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. ఐటమ్స్ సాంగ్స్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ‘స్త్రీ2’ సినిమా కోసం ‘ఆజ్ కీ రాత్..’ అంటూ యువతకు అందాల విందు పం చింది.

ఇటీవల ఈ మిల్కీ బ్యూటీ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ చిత్రంలో చేసిన ప్రత్యేక గీతం ‘గఫూర్..’ ప్రస్తుతం సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తన సినీజీవితం గురించి చెప్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు ఈ గుర్తింపు సినిమాల వల్ల రాలేదని, కేవలం ఐటమ్ సాంగ్స్ వల్లే తాను ఫేమస్ అయ్యానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తమన్నా ఐటమ్స్ సాంగ్స్ గురించి మాట్లాడుతూ.. “నేను తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో చాలా సినిమాలు చేశాను. కానీ, అవి నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. కానీ, బద్రినాథ్ సినిమాలో అల్లు అర్జున్‌తో నేను చేసిన డాన్స్ చూసి చాలా మంది నిర్మాతలు ఐటెం సింగ్స్ కోసం నా దగ్గరకు వచ్చారు. అలా దక్షిణాదిలోనే కాకుండా హిందీలో కూడా నేను చేసిన ప్రత్యేక గీతాలతో మంచి క్రేజ్ వచ్చింది.

అలా వరుసగా ఐటెం సాంగ్స్ చేస్తూనే వస్తున్నా. సినిమాల కంటే ఐటెం సాంగ్స్ నాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇకముందు కూడా ప్రత్యేక గీతాలు చేయాలన్న ఆసక్తితోనే ఉన్నా” అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్‌తో తమన్నాను హీరోయిన్‌గా ఆరాధించిన ఫ్యాన్స్ అవాక్కవుతూ నెట్టింట స్పందిస్తున్నారు.