calender_icon.png 1 October, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్లీ గల్లీకీ.. శంకర్ దాదా ఆర్‌ఎంపీలు

01-10-2025 12:08:14 AM

  1. వరుసగా కురిసిన వర్షాలతో... విజృంభిస్తున్న  వ్యాధులు

ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్న రోగులు

అర్హతకు మించి వైద్యం అందిస్తున్న ఆర్‌ఎంపిలు?

తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు

విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ మందుల వినియోగం

పట్టించుకోని ఉన్నతాధికారులు

నాగర్ కర్నూల్ సెప్టెంబర్ 30 ( విజయక్రాంతి ) : కొద్దిరోజులుగా వరుసగా కురుస్తు న్న ముసురు వర్షాలతో గ్రామాల్లో లోపించిన పారిశుధ్యం కారణంగా వ్యాధులు ప్ర బలుతున్నాయి. ఇదే అదునుగా భావించిన కొంతమంది వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రథ మ చికిత్స కేంద్రాలు (ఆర్‌ఎంపి) (పిఎంపి) కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు.

స్థాయికి మించిన వైద్యం చేస్తూ కాసులు దండుకుంటున్నారని అనవసరమైన యాంటీబయా టిక్ మందులను రోగులకు అంటగడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ యా ప్రధాన పట్టణ కేంద్రాలు జిల్లా కేంద్రాల్లోనూ పుట్టగొడుగుల ఆర్.ఎం.పి క్లినిక్లు ప్రైవేటు ఆసుపత్రులు పుట్టుకొస్తున్నాయి.

ప్రథమ చికిత్సకి పరిమితం కావలసిన సద రు ఆర్‌ఎంపీలు స్థాయికి మించిన వైద్యం చేస్తూ కాసులు దండుకుంటున్నారని ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ఫలితంగా దీర్ఘకాలిక రోగాలతో పాటు కొంత మంది అప్పటికప్పుడే వైద్యం వికటించి మృ త్యువాత పడుతున్న ఘటనలు కూడా కోకొల్లలు. అక్కడక్కడ పలు గ్రామాల్లోని బాధితు లు, సామాన్య రోగులు ప్రైవేటు ఆస్పత్రులు, 

ఆర్‌ఎంపీలపై ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని కిందిస్థాయి సిబ్బంది ప్రతి ఆర్‌ఎంపి, ఆస్పత్రి స్థాయిని బట్టి రేటు నిర్ణయిం చి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగం. 

కొందరు ఆర్‌ఎంపీ డాక్టర్లు యాంటీబయోటిక్స్తో పాటు స్టెరాయిడ్స్ వంటి వాటిని రోగులకు ఇస్తున్నారనేది బహిరంగ రహస్యమే. రోగి బరువు, వయసు రోగి పరిస్థితిని బట్టి అన్ని అర్హతలు ఉన్న డాక్టర్లు మాత్రమే రాయాల్సిన మందులను గ్రామాల్లో ఆర్‌ఎంపీలు రెఫర్ చేయడం ఆందోళన కలిగిస్తుంది. అంతటితో ఆగని కొందరు ఆర్‌ఎంపీలు అర్హ త లేకున్న ప్రిస్క్రిప్షన్ రాయడంతో పాటు ప్రథమ చికిత్సకు వచ్చే రోగులకు సెలెన్, ఇంజక్షన్లను ఇస్తున్నారు.

ఆర్‌ఎంపీల దగ్గరికి వచ్చిన వారి ఆరోగ్య స్థితిపై పూర్తి అవగాహన లేకుండా ఇస్తున్న మందులు భవిష్య త్తులో అనేక దుష్పరిణామాలకు కారణం అ వుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాల్సిన ఆర్‌ఎంపిలు పరిధికి మించి వైద్యం చేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రైవేట్ హాస్పిటల్స్తో కమిషన్ దందాలు

జిల్లాలో ఉన్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులతో పాటుగా ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంట ర్స్, పాథాలజీ ల్యాబ్స్లతో కుమ్మక్కై కొంతమంది ఆర్‌ఎంపీలు కమిషన్ దందాలకు తెర లేపారు. ప్రథమ చికిత్సకై వచ్చిన వారికి లేని రోగాలను అంటగట్టి ప్రైవేట్ ఆస్పత్రుల పాలు చేస్తున్నారు. రోగం చిన్నదే అయినా ఆ భయాన్ని పెద్దగా చూపి వేలల్లో గుంజుతున్నారని విమర్శలొస్తున్నాయి.

ఒక్కో పేషంట్ను రెఫెర్ చేస్తే రోగాన్ని బట్టి 20% నుండి 40 %శాతం కమిషన్ ఆర్‌ఎంపీలకు ఇస్తూ మరికొందరు పేషెంట్లను తీసుకువచ్చే విధంగా ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయన్నది బహిరంగంగావినిపిస్తున్నాయి.ప్రభుత్వ ఉద్యోగం చే స్తూనే ప్రైవేట్ క్లినిక్ సెంటర్లు. ప్రభుత్వ శా ఖలో పని చేయాల్సిన వైద్యులు, సిబ్బంది ఆ యా గ్రామాల్లో ప్రైవేటు క్లినిక్లు ఏర్పాటు చేసుకొని విధులకు డుమ్మా కొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరి కొంతమంది ఆర్‌ఎంపి క్లినిక్ బోర్డులపై ఎంబిబిఎస్ డాక్టర్ వంటి బోర్డులను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారని బాహాటంగానే విమర్శలు ఉన్నా యి. మరి కొంతమంది ప్రైవేటు ఆసుపత్రు లు సైతం కిందిస్థాయి సిబ్బంది చేత వైద్యం చేయించి కంటి తుడుపుగా డిగ్రీలు పేర్లుగా నమోదు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అయినప్పటికీ జిల్లా వైద్య ఆ రోగ్యశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం పట్ల భారీగా వసూళ్లకు పా ల్పడుతున్నట్లు అనుమానాలు రేకెత్తుతున్నా యి.

ఏదైనా ఆస్పత్రులు క్లినిక్లపై ఫిర్యాదులు అందిన వెంటనే తనిఖీల పేర్లతో భారీగా వ సూలు చేపడుతున్నట్లు విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి అక్రమాలకు వసూళ్లకు పాల్పడుతున్న వారి పట్ల చర్యలు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.చర్యలు తీసుకోవాలంటే కమిటీ నిర్ణయం కావాలి.

జి ల్లాలోని ఆయా ఆర్‌ఎంపి, పి.ఎం.పి ఇతర ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా కలెక్టర్ స్థాయిలోని కమిటీ నిర్ణ యం కావాలి.  రోగులు ప్రభుత్వ ఆసుపత్రులనే ఆశ్రయించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే మెరుగైన వైద్యం అందుతుంది.రవి నాయక్, వైద్య ఆరోగ్యశాఖ ఇన్చార్జ్ అధికారి, నాగర్ కర్నూల్ జిల్లా.