calender_icon.png 6 August, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగీర్‌లో జంఝాట్?

06-08-2025 12:00:00 AM

సెల్లార్లు.. నిర్మాణాలు

మణికొండ, ఆగస్టు 5: నూతన మున్సిపల్ చట్టం ద్వారా అక్రమ నిర్మాణాలను నిరోధించాలని అనుకున్నా ఆచరణ సాధ్యం కావడం లేదు. కారణాలు ఏవైనా మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో అక్రమ నిర్మాణా లు, అక్రమ సెల్లార్లూ చేపడుతున్నారు. ఈ  క్రమంలోనే బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణాలు, సెల్లార్ల తవ్వకాలు విమర్శలకు తా విస్తున్నాయి.

ఈ విషయంలో కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర స్పందిస్తూ అక్రమాలను సహించమంటూ పేర్కొనడం గమనా ర్హం. ఐటీ ప్రాంతం, ఓర్‌ఆర్‌ఆర్ కు చేరువలో ఉండటంతో బండ్లగూడ జాగీర్ ప్రాంతంలో నిర్మాణాలకు డిమాండ్ ఉంది. అందుకే అక్క డ నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలకు ఆదరణ లభిస్తోంది. దీనిని అవకాశం తీసుకుని కొందరు నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్న భవనా లు విమర్శలకు తావిస్తున్నాయి.

అదే సమయంలో వర్షాకాలం ప్రారంభమైనా సెల్లార్ల తవ్వకాలు చేపడుతున్నారు. ఊహించని ఘ టనలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అనేది అంతుచిక్కడం లేదు. అక్రమ నిర్మాణాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండిపడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం ఆందోళనకరంగా మారింది.