06-08-2025 12:00:00 AM
సంపదంతా వడ్డీ వ్యాపారులకు... ప్రైవేట్‌లోన్ లకే సరి
ఏట పెరుగుతున్న ఆర్థిక ఇబ్బందులు,ఆత్మహత్యలు
కుటుంబాలలో విచ్ఛిన్నం అవుతున్న ప్రేమానురాగాలు
సామాన్యుడు.. మధ్యతరగతి కుటుంబాలకు.. జీవనోపాధికి సంకటం
వనపర్తి, ఆగస్టు 05 ( విజయక్రాంతి ) కొన్ని దశాబ్దాల క్రితం ఉమ్మడి కుటుంబాలు ఇల్లును చెక్కపెట్టే తరుణంలో నాడు అప్పు అంటేనే ఆ కుటుంబాన్ని వణికిపోయేది. ఆ పరిస్థితి రాకూడదని దేవుళ్లకు మొక్కుకునేవా రు. ఉన్నదాంట్లోనే సర్ది పెట్టుకోవడమే తప్ప అప్పు జోలికి వెళ్లేందుకు తాతల కాలం నాటి రోజుల్లో జంకె వాళ్లు. అంతకంటే మించి అ ప్పు తీసుకుంటే ఆ కుటుంబానికి అప్రతిష్టే..
సమాజంలో పెద్దింటిగా మెలిగిన వారికి ఈ పరిస్థితి నాముషీగా ఉండేది. తమ హీన స్థితి కి ఇదొక నిదర్శనంగా భావించేవారు. కష్టిం చి పనిచేయడమే ధ్యేయంగా మిగిలిన రోజు ల్లో అత్యవసరాల్లో తప్ప చేతు బదులు కూడా చేజాచని కుటుంబాలు లెక్కకు మిక్కి లి. అప్పట్లో ఇంటి పెద్ద అన్ని పదులు సరి చూసుకునేవారు. ఎవరికి ఎంత కావాలో ఏ డాదికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు వేసుకునేవారు.
పూర్వం ఆర్భాటాలు ఉండేవి కావు
పెళ్లయినా..పేరంటాలైన సోకులకు పో యేవాళ్లు కారు. ఆర్థికంగా కొంత స్థిరపడి క్ర మశిక్షణగా మెలిగే కుటుంబాలను అప్పటికి.. ఇప్పటికీ కూడా పిసినారి అంటూ ట్యాగులు తలిగిస్తారు. అదే స్తోమతకు మించి అప్పులు చేసి సోకులకు పోయే వారిని చూసి మురిసిపోయేవారు ఎందరో....రాను రాను ఇంటి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో... కుటుంబాలలో రకరకాల కారణాలవల్ల విచ్ఛిన్నమ వుతున్న సందర్భాలు దర్శనమిస్తున్నాయి.
పాత రోజుల్లో సహపంక్తి భోజనం చేస్తూ ఎంతో మురిసిపోయేవారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో స్తోమత లేకపోయినా.. అం దనంత ఎత్తులో ఆలోచనలు ఉండడంతో... లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడం కోసం మితిమీరిన ఖర్చులు చేసి అప్పుల ఊబిలో నలుగు తూ జీవిత చక్రాలను నడిపిస్తున్నారు.
కష్టపడ్డ సంపాదన.. బూడిదపాలు
పూర్వం రోజుల్లో.... వ్యవసాయ కూలీలుగా ఉంటూ... పొట్ట నింపుకునేందుకు అష్ట కష్టాలు పడి కుటుంబ జీవనం సాగుతుండేది. ఆధునిక జీవన విధానంలో మార్పులు తలెత్తుతున్న తరుణంలో... కుటుంబ జీవనం కొనసాగేందుకు ప్రశ్నార్థకమవుతుంది. ఉ మ్మడి కుటుంబంలో అందరూ పనిచేయకపో యినా ఎలాగోలాగా జీవన విధానం నడిచేది... ప్రస్తుతం ఇంట్లో ఇద్దరు లేక నలుగురు పనిచేస్తున్న...
చీటీలు.. ప్రైవేటు ఫైనా న్స్ లు, బ్యాంక్ అప్పులు.. మహిళా సంఘా లు ఇలా ఒక్కటేంటి మూడు నాలుగు కట్ట డం తో నెల తిరిగేసరికి మరలా మొదటి సమస్యగా తయారైంది. మధ్యతరగతి కుటుంబాలు అంతో ఇంతో నెట్టుకొస్తున్న.... చేమటోడ్చి కూలి నాలి పని చేసుకుంటున్నా మధ్యతరగతి కుటుంబాల బ్రతుకులు చిద్రమవుతున్నాయి.
మైక్రో ఫైనాన్స్ లోన్‌తో తల పట్టుకుంటున్న పరిస్థితి...!!
లోను కావాలంటే సులుభమైన పని... జస్ట్ మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. మేమే వచ్చి మీ డీటె యిల్స్ నమోదు చేసి లోన్ లు ఇప్పిస్తామని ఏజెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అ యితే సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని... వీక్లీ లోన్.. మంత్లీ లోన్.. టు వీక్స్ లోన్.. డైలీ ఫైనాన్స్ లు.. చిట్ ఫం డ్స్ వంటి వాటిల్లో అమాయక ప్రజలను మో సం చేస్తూ వారు కట్టని పరిస్థితుల్లో తీవ్ర ఒత్తిళ్లు తెచ్చి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ని బంధనలను ఉల్లంఘిస్తూ మైక్రో ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు ,సిబ్బంది అమాయక ప్ర జలను నట్టేట ముంచి. మళ్లీ వారికి ఎక్కడ లోనూ పుట్టకుండా సిబిల్ పై ప్రభావం చూ పుతున్నారు. వీటిపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ స్పెషల్ డ్రైవ్ చేపట్టి బాధితులకు భరోసానివ్వాలనికోరుతున్నారు.