11-09-2025 12:22:24 AM
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆగ్రహం
మంచిర్యాల, సెప్టెంబర్ 10 (విజయక్రాం తి): మంచిర్యాలలో కాంగ్రెస్ నాయకులు గుండాల్లుగా వ్యవహరిస్తున్నారని, వారికి పోలీసులు సపోర్టు చేస్తున్నారని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు మొదలయ్యా యని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు.
బీఆర్‌ఎస్ నాయకులపై కేసులు పెడుతున్నారని, కాంగ్రెస్ నాయకులపై ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. జిల్లాలో రౌడీజం పెరిగి పోయిందని, బీఆర్‌ఎస్ నాయకులపై దాడులు అధికమయ్యాయని మాజీ ఎంఎల్‌ఏ దివాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళ వారం అర్థరాత్రి బీఆర్‌ఎస్ నాయకుడు కాటం రాజుపై జరిగిన దాడి బాధాకరమన్నారు.
పోలీస్స్టేషన్లోనే కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు చూస్తూ ఉండటం చాలా దురదృష్టకరమన్నారు. కనీసం గాయపడిన నాయకు డిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికీ కూడా సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ఎంతమంది పోలీస్స్టేషన్లోకి చొరబడ్డారో సీసీకెమెరా వీడియో బయట పెట్టాల ని, దాడులకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రామగుండం సీపీ మంచిర్యాల రూరల్ సీఐ తిరుపై విచారణ జరిపి స్టేషన్లోకి ఎంతమంది చొరబడ్డారో తెలుసుకోవాలన్నారు. డీజీ సైతం మంచిర్యాలలో ఏం జరుగుతుందో పరిశీలించాలని, ముఖ్యమంత్రి సైతం సీనియర్ జడ్జితో విచారణ జరిపించి నిజాలు వెలుగులోకి తేవాలని, ఇకనైనా తప్పు డు కేసులు, దాడులు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొం దుతున్న రాజును పరామర్శించి కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు లక్షెట్టిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య, అత్తి సరోజ, డేగ సత్యం, అంకం నరేష్, బేర సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.