11-09-2025 12:22:56 AM
ఇల్లెందు, సెప్టెంబర్ 10,(విజయక్రాంతి):వర్క్ పీపుల్ స్పోరట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఇల్లందు ఏరియా అధ్వర్యంలో స్థానిక రన్స్ అండ్ గోల్స్ స్టేడియం నందు 2025-26 సంవత్సరానికి గాను విభాగాల స్థాయి క్రీడలను బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య ప్రెసిడెంట్ వర్క్ పీపుల్ స్పోరట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్, ప్రారంబించారు.
ఈ సందర్భము గా జి.యం. వి.కృష్ణయ్య కబడ్డీ మరియు బా ల్ బ్యాట్మన్ పోటీలను ప్రారంబించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ అధికారి జాకీర్ హుస్సేన్, చీఫ్ కోఆర్దినేటర్ డిజియం పర్సనల్ అజ్మీర తుకారాం, ఏరియా సెక్యూరిటీ అధికారి అంజి రెడ్డి, పర్చేస్ అధికారి దిలీప్ కుమార్, డి యై.పి.యం. బి. శ్యాం ప్రసాద్, అధికారుల సంఘం నుంచి నాగేశ్వర్ రావు, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ నజీర్ అహ్మద్, ప్రాతినిధ్య సంఘం జే.వెంకటేశ్వర్లు, గౌరవ కార్యదర్శి సీనియర్ పర్సనల్ ఆఫీసర్ వి.అజయ్, క్రీడా సమన్వయ కర్త కాలవల వెంకటేశ్వర్లు, జనరల్ కెప్టన్ దాట్ల శ్రీకాంత్, ఇతర క్రీడ కారులు పాల్గొన్నారు.