12-09-2025 12:00:00 AM
మంచిర్యాల, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): మంచిర్యాలలోని షెడ్యూల్ కులముల కళాశాల బాలుర వసతి గృహంలో ఉంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకొని సీపీ గేట్ రాష్ర్ట స్థాయి పరీక్షలో ర్యాంకులు సాధించినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు సీహె దుర్గాప్రసాద్ గురువారం తెలిపారు.
సీపీగేట్ రాష్ర్టస్థాయి లో దుర్గం శంకర్ భౌతిక శాస్త్ర విభాగంలో 21వ ర్యాంకును సాధించి ఉస్మానియా యూ నివర్సిటీ క్యాంపస్ లో అడ్మిషన్ పొందారన్నారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలో మంచి ర్యాంకుతో బీపీఈడీ విభాగంలో ఆకుదారి రామ్ భూపాల్ అడ్మిషన్ పొందాడన్నా రు. ర్యాంకులు సాధించి సీట్లు సాధించిన ఎస్సీ డీడీ దుర్గా ప్రసాద్‌తో పాటు వసతి గృ హ సంక్షేమ అధికారి సిహె కుమారస్వామిలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.