calender_icon.png 12 September, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడల్ స్కూల్ విద్యార్థులకు ఫీల్డ్ విజిట్

12-09-2025 12:00:00 AM

మంచిర్యాల, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి) : మంచిర్యాల రాజీవ్ నగర్ లోని టీజీ మోడల్ స్కూల్ ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు పాఠశాలలో బోధనతో పాటు ప్రాక్టికల్ గా అవగాహన కల్పించడంలో భాగంగా గురు వారం విద్యార్థులకు వీఎన్‌ఆర్ కంపెనీలో మినరల్ వాటర్ తయారీని ఉపాధ్యాయ బృందం దగ్గరుండి చూపించారు. మినరల్ వాటర్ బాటిల్ ఎలా తయారు చేస్తారో, కంపెనీ లేబుల్ లు వేసి మార్కెటింగ్ కు ఎలా తీసుకువెళతారో వివరించగా విద్యార్థులు నోట్ చేసుకున్నారు.