06-12-2025 12:00:00 AM
- పలు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల మధ్యే పోరు
- సమితి సింగారంలో త్రిముఖ పోటీ..
- స్థానికంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, టిడిపి ఫోకస్
- పాగా వేసేందుకు పార్టీల ప్రణాళికలు
- రసవత్తరంగా పల్లె రాజకీయం
- సర్పంచ్ బరిలో భారీగా అభ్యర్థులు
- సత్తా చాటే పనిలో హస్తం, పట్టు నిలుపుకునేందుకు కారు యత్నం..
- పల్లెల్లో తిష్టవేసేందుకు సైకిల్ వ్యూహాలు..
మణుగూరు, డిసెంబర్ 5 (విజయక్రాంతి) : మండలంలోని పంచాయతీలలో ఎన్నికల సందడి నెలకొంది. తొలి దశ ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలు పొందుతారని అధికార పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే చాలా చోట్ల ఆ పార్టీలో రెబల్ అభ్యర్థులు నిలవడం వల్ల ఇంటి పోరుతో సతమతమవుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలఫై విజయక్రాంతి కథనం..
త్రిముఖ పోటీ..
మండలంలో మేజర్ పంచాయతీ సమితి సింగారంలో ఎన్నికలను కాంగ్రెస్, తెలుగుదేశం, బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుం టున్నాయి. సర్పంచ్ ఎన్నికలు పార్టీ రహితమే అయినప్పటికీ మూడు ప్రధాన పార్టీ లు స్పెషల్ ఫోకస్ చేశాయి. పల్లెల్లో పట్టును నిలుపుకొనేందుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, జిల్లా కాంగ్రెస్ నేత తుళ్లూరి బ్రమ్మ య్య సవాలుగా స్వీకరించి వ్యూహా లు రచిస్తున్నారు.
దీంతో క్షేత్ర స్థాయిలో ఏ వ్యూహం తో ప్రచా రం చేస్తే ప్రజల మద్దతును కూడగట్టొచ్చనే విషయమై ఆయా పార్టీల మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమాలోచన చేస్తున్నారు. మండలాల వారీగా ముఖ్య నాయకులతో రహస్య మీటింగ్ లు నిర్వ హిస్తున్నారు. మొత్తంగా పల్లె రాజకీయాల్ని నాయకులు ఈసారి మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. అధికార పార్టీలోనే ఎమ్మెల్యే పా యం వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య మధ్య నెలకొన్న విభేదాలకు సమితి సింగారం పంచాయతీ ఎన్నిక వేదికగా నిలిచింది.
హస్తగతం కోసం..
పల్లెపోరులో కాంగ్రెస్ సత్తా చాటేందుకు ఉత్సాహం కనబరుస్తోంది. అధికార బలం తో మెజార్టీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. నియోజకవర్గ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యేలు నిత్యం సమీక్షిస్తున్నారు. జిల్లాలో ఎక్కువ మంది సర్పంచులు, వార్డు సభ్యులు గెలిపించు కోవాలనే పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే వ్యూహాల పదును పెట్టి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది.
మె జారిటీ సర్పంచ్ తమ పార్టీ మద్దతు దారులను గెలిపించుకునేందుకు కసరత్తు చేస్తోంది. రేవంత్ సర్కార్ స్కీంలే తమ విజయానికి దోహదపడతాయని కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చే స్తున్నారు. కానీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఫై అదే పార్టీకి చెందిన తుళ్లూరి అనుచరులు తిరుగుబాటు బావుట ఎగరేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమ యంలో టిడిపి మద్ద తుతో విజ యం సాధించిన పినపాక ఎమ్మె ల్యే పాయం వెంకటేశ్వర్లు ఆ పార్టీకి ఇచ్చిన మాట తప్పినారని, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి మీడియా సాక్షిగా వెల్లడించారు.
కాంగ్రెస్, తె లుగుదేశం పార్టీ లీడర్లు స్నేహపూర్వక మై త్రిని కొన సాగిస్తూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎ మ్మెల్యే అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు గెలుపుకు సహకరించడం జరిగిందని, ఆ సమ యంలో అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నో ఇ బ్బందులకు గురిచేసి ఒత్తిడిలు తెచ్చినా వారి బెదిరింపులకు తలొగ్గకుండా ఎమ్మెల్యే గెలు పు కోసం పనిచేశామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తమ మద్దతు పూర్తిగా ఉంటుందని సమి తి సింగారం గ్రా మపంచాయతీ సిట్టింగ్ సర్పంచ్ స్థానాన్ని తిరిగి గెలిపించేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఆ మాట తప్పారనే విషయాన్ని తుళ్లూరు అనుచరులు బహిరంగం గా ప్రసారం చేస్తున్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి టిడిపి అభ్యర్థి బచ్చల భారతి గెలుపు కోసం ప్రచారం చేయడం జరుగుతుందని, వారు చెబుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో పని చేస్తూ బ్రహ్మయ్య తెలుగుదేశం అభ్యర్థికి ఎలా ప్రచారం చేస్తారని సీరియర్ కాంగ్రెస్ నాయకులు బ్రహ్మ య్య తీరును ప్రశ్నిస్తున్నారు.అవసరమైతే ఆయన తెలుగుదేశం కండువా కప్పుకోవచ్చు అని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ద్రోహం చేస్తే సహించమని గంట పదంగా హెచ్చరిస్తున్నారు.
పూర్వ వైభవం కోసం బీఆర్‌ఎస్
గ్రామాల్లో బీఆర్‌ఎస్ కు నేటికీ పట్టు ఉంది. ఆ బలంలో ఎక్కువ మంది సర్పం చు లను గెలిపించుకోవడం, తద్వారా భవిష్యత్ లో రానున్న ఎన్నికల్లో సత్తా చాటాలని మా జీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు భావిస్తున్నారు. ఎన్నికలలో అ భ్యర్థులను గెలిపించుకునేందుకు ఆయన పూర్తి స్థాయి లో రంగంలోకి దిగారు. పం చాయ తీ ల్లో పార్టీ మారని అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. పంచాయతీల్లో పూర్వ వైభ వం కోసం ఈ ఎన్నికలను మంచి అవ కా శంగా భావిస్తున్నారు. గత పదేళ్లలో బీఆర్ ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ.. కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచి స్తున్నారు.
ఇంటి పోరు ఇంతింత కాదయా..!
నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తాయి. కొద్ది నెలలుగా పార్టీ అధిష్టానం ఒక జిల్లా నా యకుడిని పక్కన పెట్టడంతో, ఆయన తన వర్గాన్ని బలోపేతం చేసుకుం టున్నా రు. పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, తన వర్గం అభ్యర్థులకు పార్టీ మ ద్దతు లభించకపోవడంతో, వారు స్వ తంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతు న్నట్లు సమాచారం. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేయడం వల్ల కార్యకర్తలు అయోమయానికి గురవు తున్నారు.
గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున ఎన్ని కల బరిలో ఉన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇద్దరు పోటీ పడుతున్నారు. దీంతో అధికార పార్టీకి ఇంటి పోరు తప్పడం లేదు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కాంగ్రెస్ నా యకులు తుళ్లూరు బ్రహ్మయ్య మధ్య పోరు ఎటువైపు దారి తీయనున్నదో స్థానిక సంస్థల ఫలితాలలో వెల్లడి కానున్నది.