24-12-2025 12:31:10 AM
నిర్మల్, డిసెంబర్ ౨3 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయులు ఆందోళనకు శ్రీకారం చుట్టారు. జర్నలిస్టులపై పాలకులు అధికారులు ఇండ్ల స్థలాల కేటాయింపులో తీవ్ర అన్యాయం చేయడంతోనే రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్టు అధ్యక్ష ప్రధా న కార్యదర్శులు రాస శ్రీధర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు రాజన్న నందిరామయ్య రామ లక్ష్మణ్ నూతన కుమార్ సురేష్ ఎస్టియు జిల్లా నాయకులు జి లక్ష్మణ్ వెంకటేశ్వర్లు ఇస్తే కార్ ఇందువాద సంస్థల నాయకులు సంఘీభావం తెలిపారు