calender_icon.png 3 July, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాపుగల్లులో ఇళ్లస్థలాలు అప్పగించాలి

27-05-2025 12:00:00 AM

ఆర్డీఓ ఎమ్మార్వోలకు వినతి

కోదాడ మే 26: కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో పేద ప్రజలకు పక్కాగా ఇళ్ల స్థలాలు అప్పగించాలి అని నాయకులు వెలది పద్మావతి, బోస్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం పట్టణంలోని ఆర్డీవో సూర్యనా రాయణ, తాసిల్దార్ వాజిద్ అలీ లకు వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం గతంలో కాపుగల్లు గ్రామస్తులకి పట్టాలు కూడా ఇచ్చిందని దానిలో చాలామంది గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వారికి పక్కాగా ఇళ్ల స్థలాలు కేటాయించి. మౌలిక సదుపాయాలు అందించాలని కోరారు.

గుడిస వాసుల కోసం అనేక పోరాటాలు చేశామని తెలిపారు. తమ వైపు పెట్టిన కేసులకు హైకోర్టులో కూడా గెలిచామని తెలిపారు. అధికారులు ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు పక్కాగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల లబ్ధిదా రులు, తదితరులు పాల్గొన్నారు.