calender_icon.png 14 October, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గృహిణి అదృశ్యం

13-10-2025 06:52:33 PM

మేడిపల్లి,(విజయశాంతి): గృహిణి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖిల్లా వరంగల్ కు చెందిన  గోగు దామోదర్ గత ఐదు సంవత్సరాల  నుండి తన భార్య పిల్లలతో బోడుప్పల్  బొల్లిగూడెం లో ఉంటున్నాడు, తన భార్య  గోగు రవళిక (32) గృహిణి, తరచుగా ఫోన్‌లో మాట్లాడుతుందని భార్యాభర్తలు  ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. 

ఈనెల 01వ తేదీ నాడు ఇదే విషయంపై గొడవ పడగా మరుసటి రోజు ఉదయం రవళిక ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఇదే విషయం దామోదర్ కు తన కూతురు ఫోన్ చేసి చెప్పడంతో భర్త మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు  చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నామని, రవళిక  సమాచారం తెలిసినచో పోలీసులకు తెలియ పరచాలని సీఐ గోవిందరెడ్డి తెలిపారు.