calender_icon.png 14 October, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా డీసీసీ అధ్యక్షుని ఎంపిక

14-10-2025 12:49:48 AM

 ఎఐసిసి పరిశీలకులు సారత్  రౌత్

సూర్యాపేట, అక్టోబర్ 13 (విజయక్రాంతి) : ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఎంపిక చేయడం కోసం సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని  ఏఐసిసి పరిశీలకులు సారత్ రౌత్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం  జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘటల్ సృజన్ అభియాన్ కార్యక్రమం మొదట గుజరాత్ లో విజయవంతంగా నిర్వహించిన తరువాత ,మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్,పంజాబ్, ఝార్ఖండ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల నుండి అభిప్రాయం సేకరించి డిసిసి అధ్యక్షులు ఎంపిక చేసినట్టు తెలిపారు.

ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం, దేశవ్యాప్తంగా యువతను కలవడం కోసం, దేశ సమైక్యత సమగ్రత కోసం భారత్ జోడో యాత్రని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మరియు మణిపూర్ నుంచి ముంబై వరకు చేపట్టారన్నారు. దీనిలో భాగంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను కలిశారన్నారు. ఆయన ఆలోచన ప్రకారం పార్టీలో  సంస్కరణలు  తీసుకురావడంలో భాగంగా డిసిసి అద్యక్షుడి ఎంపిక కోసం జిల్లా వ్యాప్తంగా  మండలాలు, గ్రామాలలో తాను పర్యటిస్తానని, అందరి అభిప్రాయాలు తెలుసుకుని డిసిసి అధ్యక్షుని ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

యువతకు ప్రాధాన్యత ఇస్తూ,  ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుండి  ఆరుగురు పేర్లు ఏఐసిసికి పంపిస్తామని, వారిలో ఒకరిని డిసిసి అధ్యక్షునిగా ఎఐసిసి ఎంపిక  చేస్తుందన్నారు. పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు పౌర సమాజం, ఎన్జీవోలను కలుస్తానని, ఎవరైనా తమ అభిప్రాయం తెలుపవచ్చన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ప్రకారం ఉత్తమమైన వ్యక్తులను తాను  సెలెక్ట్  చేస్తామన్నారు. పార్టీ కోసం లాభాపేక్ష లేకుండా పనిచేసే వారిని, పార్టి అబివృద్ది కోసం పనిచేసే వారిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వము, ఇటు పార్టీ కూడా పటిష్టం  అయ్యేవిధంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి సి సి అద్యక్షులు  చెవిటి వెంకన్న యాదవ్, టూరిజం  కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్,  ఏఐసిసి జనరల్ సెక్రటరీ చకిలం రాజేశ్వరరావు, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ ప్రగడ కిషన్ రావు, ఒబిసి రాష్ర్ట నాయకులు తండు  శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎలిమినేటి  అభినయ్, బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎన్‌ఎస్ యుఐ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.