14-10-2025 12:47:46 AM
మంచిర్యాల, అక్టోబర్ 13 (విజయక్రాంతి): ఎన్నో ఏండ్లుగా 170 కుటుంబాలుకు సంబంధించిన 457 ఎకరాల భూ సమస్యలను కలెక్టర్ ఆదేశాలతో జన్నారం తహశీల్దార్ రాజమనోహర్‌రెడ్డి, రెవెన్యూ అధికారుల సమన్వయంతో రైతుల సమక్షంలో పరిష్కరించారు.
కలెక్టర్ ప్రత్యేక చొరవతోనే ఇది సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేస్తూ సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో కలెక్టర్ కుమార్‌దీపక్‌ను మహమ్మదాబాద్ గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పం లక్ష్మణ్ పాల్గొన్నారు.