calender_icon.png 15 January, 2026 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాలల నిర్వహణ ఎలా?

15-01-2026 03:31:57 AM

  1. వేదిస్తున్న నిధుల కొరత
  2. రూ.500 కోట్లు అడగనున్న అధికారులు
  3. వచ్చే బడ్జెట్‌లో కేటాయించాలని కోరనున్న విద్యాశాఖ

హైదరాబాద్, జనవరి 14 (విజయక్రాంతి) : వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వ పాఠశాలల మెయింటెనెన్స్‌కు కనీసం రూ.500 కోట్లు అడగాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి కోరనున్నారు. పాఠశాల విద్యాశాఖకు బడ్జెట్‌లో కేటాయించే నిధులతోపాటు మరుగుదొడ్లు మెయింటెనెన్స్, తర గతి గదుల రిపేర్లు, వాటర్ ట్యాంకులు లీకేజీలు, వంటశాలల రిపేర్లకు కావాల్సిన అద నంగా నిధులు పాఠశాలల వద్ద ఉండడంలేదు. పాఠశాలల్లో ఏదైనా అనుకోని రిపేర్లు చేయాల్సి వస్తే ఒక్క రూపాయి ఉండని పరిస్థితి. ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించే నిధు లు ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, ఇతరత్ర వాటికే సరిపోతున్నాయి.

ఇవి కాకుండా అదనంగా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటా యించకపోవడంతో ఈ మెయింటెనెన్స్ పనులకు ఎలా సద్దాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే స్కూల్ గ్రాంట్స్ కింద నిధులు వస్తున్నా గానీ, అవికాస్త చాక్‌పీసులు, స్టేషనరీ వంటి రోజూవారి అవసరాల కోసం కొనుగోలు చేయడం, ప్రయోగశాలల పరికరాలకు, పాఠశాలల సమావేశాలు, జనవరి 26, ఆగస్టు 15 వంటి జాతీయ పండగల నిర్వహణ, న్యూస్ పేపర్స్, ఇతర పుస్తకాలను కొనుగోలు కోసం నిధులను ఖర్చు చేస్తున్నారు. ఇచ్చే నిధులు కూడా వీటికే సరిపోతుండటంతో మిగతా రిపేర్లకు ఒక్క పైసా కూడా నిధులు ఉండటంలేదని ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం రూ.500 కోట్లు ఇటువంటి పను లకు కేటాయిస్తే ఏమైనా చేసే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

బడ్జెట్‌లోని నిధులన్నీ వేతనాలకే..

ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు రూ 23,108 (7.57 శాతం) కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.21,292 (7.31 శాతం) కోట్లు కేటాయించగా, 2024-25తో పోలిస్తే ఈసారి రూ1,816 కోట్లు అదనంగా కేటాయించారు. మొత్తం పాఠశాల విద్యాశాఖ బడ్జెట్‌లో కనీసం 85 శాతం ఉపాధ్యాయులు, ఉద్యోగుల వేతనాలకే పోతున్నాయి. ప్రగతిపద్దు అంతా కేంద్ర ప్రయోజిత పథకాలైన మధ్యాహ్న భోజనం (పీఎం పోషణ్), సమగ్ర శిక్షా ఇతరత్రా పథకాలకే రాష్ట్ర వాటా కింద 40 శాతానికి సరిపోతుంది. ఇక బడుల రిపేర్లు, ఇతర పనులకు నిధులు కావాలంటే అంతే సంగతులు. ఈక్రమంలోనే ఈసారి బడ్జెట్‌లో ప్రత్యేక మెయింటెనెన్స్ పనుల కోసం మొత్తం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు శాతాన్ని ప్రభుత్వానికి కోరాలని అధికారులు భావిస్తున్నారు.