07-08-2025 12:31:41 AM
కలెక్టర్ విజయేందిర బోయి
నవాబ్ పేట ఆగస్టు 6 : ఇలా చదువుకుంటున్నారు ఇంటర్ తర్వాత ఏం చేస్తారు ఇప్పటినుం చి పక్క ప్రణాళికలతో విద్యాభ్యాసం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, యెన్ మాన్గండ్ల లోని అంగన్వా డి కేంద్రం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు. మౌలిక వసతుల కల్పనకు సం బంధించి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.డి. ఓ జయరాం నాయక్, ఎం.పి. ఓ నసీర్ అహ్మద్,డి.టి.సువర్ణ,అర్‌ఐ గాయత్రి, ఏ.పి. ఓ జ్యోతి తదితరులు ఉన్నారు