07-08-2025 12:32:32 AM
- సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అల్ఫోర్స్‌లో ఘనంగా ప్రారంభమైన సీబీఎస్‌ఇ క్లస్టర్ సెవెన్ బాలికల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్
కొత్తపల్లి ఆగస్టు 6 (విజయ క్రాంతి): విద్యార్థులు కష్టపడి విజయం సాధించాలని, విజయం సాధించడా నికి ఎల్లప్పుడూ ఉత్సాహం ప్రదర్శించాలని తెలంగాణ స్పోరట్స్ అథారిటీ(సాట్స్) చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ హై స్కూల్ (సీబీఎస్‌ఇ)లో క్లస్టర్ సెవెన్ బాలికల టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ను అడ్మిన్ డిసిపి పి వెంకటరమణ, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి, డివైఎస్‌ఓ శ్రీనివాస్, అబ్జర్వర్ పద్మారావు, రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమం తప్పకుండా ఆసక్తిని పెంపొందించుకొని సరియైన రీతిలో కష్టపడి విజయాన్ని సాధించాలని కోరారు. విద్యార్థులు విజయం సాధించిన పట్ల ఆసక్తిని ఎల్లప్పుడూ కొనసాగిస్తూ ఉండాలని, చ రిత్రను సృష్టించాలని సూచించారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి మా ట్లాడుతూ పాఠశాల వార్షిక ప్రణాళికలో భాగంగా నిపుణులైన వ్యాయామం ఉపాధ్యాయులచే విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలుపుతూ అద్భుత ప్రదర్శన కనబరిచిన విద్యార్థులను వివిధ పోటీలకు ఎంపిక చేయడంతో పాటు వారికి కావలసిన వనరులను కల్పిస్తున్నామని చెప్పారు.
విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గౌరవ వందనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టోర్నమెంట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 35 పాఠశాలల నుండి సుమారు 2500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు, పలు పాఠశాలల ప్రతినిధులు ,క్రీడా కోచ్ లు, టీం మేనేజర్లు, ప్రతినిధులు, క్రీడాకారులుపాల్గొన్నారు.