calender_icon.png 2 August, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంత భాగ్యమో కదా!

01-08-2025 12:45:34 AM

కుర్రాళ్ల కొత్త నేషనల్ క్రష్ దొరికేసింది! తొలి సినిమాతోనే అందం, అభినయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన ముద్దుగుమ్మ రెండో చిత్రం విడుదలైందో, లేదో.. అప్పుడే వీరాభిమానులు పుట్టుకొస్తున్నారు. ఔను, భాగ్యశ్రీ బోర్సే ఆ భాగ్యం దక్కించుకుందిప్పుడు! నిరుడు రవితేజ సరసన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది భాగ్యశ్రీ బోర్సే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంతోనే ఈ మరాఠా ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను పలుకరించింది.

అందులో గ్లామర్ షోతో యువ ప్రేక్షకులందరినీ తనవైపు తిప్పేసుకుంది. అదే సమయంలో అభినయంతోనూ సినీప్రియులను ఆకర్షించింది. అలా తొలి సినిమాతోనే అభిరుచి గల సినీజనాల దృష్టిని ఆకర్షించిందీ అమ్మడు. మొదటి సినిమా తర్వాత తెలుగులో మెల్లిగా అవకాశాలూ ఈ బ్యూటీకి వరుస కట్టాయి. ప్రస్తుతం చేతిలో నాలుగైదు సినిమాలతో బిజీగా ఉందీ భామ. ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత భాగ్యశ్రీ నటించిన సినిమా ‘కింగ్‌డమ్’.

అది గురువారం విడుదలై, పాజిటివ్ రివ్యూస్‌ను సంపాదించుకుంది. అయితే, ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న భాగ్యశ్రీ తన గ్లామరస్ లుక్స్‌తో అందరినీ కట్టిపడేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతు న్నాయి. కొత్త నేషనల్ క్రష్ అదిరిపోయిందంటూ భాగ్యశ్రీ ఫోటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. మొత్తానికి భాగ్యశ్రీ బోర్సే ట్రెండింగ్ టాపిక్‌గా మారిపోయిందిప్పుడు. భాగ్యశ్రీ సినిమాల విషయాకొస్తే.. ప్రస్తుతం రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్ తాలూక’లో నటిస్తోంది. ‘కాంత’ చిత్రంలో దుల్కర్ సల్మాన్‌తో జోడీ కడుతోంది.