calender_icon.png 14 September, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణపై వివక్ష ఇంకెన్నాళ్లు?

27-06-2025 12:00:00 AM

రాచమల్ల సిద్దేశ్వర్ :

ప్రజాస్వామ్యంలో సమాఖ్య స్ఫూర్తితో అన్ని రాష్ట్రాలను, ప్రాంతాలను సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోంది. పదకొండేళ్ల తెలంగాణకు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చే స్తోంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన హక్కులను, వాటాలను, పథకాలను కేటాయించ కుండా నరేంద్ర మోదీ సర్కార్ సవతి తల్లి ప్రేమను కనబరుస్తోంది.

రాష్ట్రాలమధ్య పె ద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభు త్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. మొద టి నుంచి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంపై చిన్నచూపున్న నరేంద్ర మోదీ ‘తల్లిని చంపి బిడ్డను బయటకు తీశారంటూ’ రాష్ట్ర ఏ ర్పాటుపై అవమానకర రీతిలో పలుమార్లు వ్యాఖ్యానించడమే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా తన అక్కసును తెలంగాణపై చూపుతూ అన్యాయం చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో తెలుగుదేశం మద్దతుపై ఆధారపడ్డ మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రయోజ నాలను పణంగా పెడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైంది నీళ్ల డిమాం డ్. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు సమన్యాయం జరగాలని ప్రజలు కోరుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబం ధనలకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి సన్నద్ధమవుతోంది.

దీనిపై కేంద్రం చోద్యం చూస్తోంది. ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగకుండా చూస్తామని ఒకవైపు చెబుతూనే, మరోవైపు ని బంధనలకు అనుగుణంగా ఉంటే బనకచర్లను పరిశీలిస్తామని చెప్పడం వారి ద్వం ద్వ వైఖరికి నిదర్శనం. నిబంధనల ప్రకా రం మాకు రావాల్సిన నీటి వాటా తేల్చాకే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ న్యాయమైన డిమాండ్‌ను పట్టించు కోవడం లేదు.

రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడకుండా కృషి చేస్తుంటే దీనిపై ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేయడం దురదృష్టకరం. బనక చర్లపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తే ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్యలోనే వాకౌట్ చేయడం, బీజేపీ కీలక నేతలు ముఖం చాటేయడం వారికి రాష్ట్ర ప్రయోజనాలపై ఎంత ఆసక్తి ఉందో తేటతెల్లమవుతోంది.

గత ప్రభుత్వ బాధ్యతా రాహిత్యం

బనకచర్ల ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ శ్రీకా రం చుట్టడానికి గత కేసీఆర్ ప్రభుత్వ బా ధ్యతా రాహిత్యమే ప్రధాన కారణం. ఆయ న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడాయిలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను తాక ట్టు పెట్టారు. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎంలుగా, కేసీఆర్ ఉ న్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు బనకచర్ల రూపంలో తెలంగాణకు గుదిబండలుగా మారాయి.

బీఆర్‌ఎస్ పాలనలో చేసిన తప్పులను ఒ క్కొక్కటి సరిదిద్దుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం జరగకూడదనే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాజీ లేని పోరాటం చేస్తున్నది. రాజకీయాలకు అతీతంగా కేంద్ర మంత్రులతోపాటు ప్రధాన మంత్రిని కూడా కలిసి తమ వాదనను వినిపించడానికి రేవంత్‌రెడ్డి హస్తిన లో శాయశక్తులా కృషి చేస్తుంటే, రాష్ట్ర బీజేపీ కీలక నేతలు ఎలాంటి బాధ్యతలు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు.

రా ష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి ముందుండాల్సిన కేంద్రమంత్రు లు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ రాజకీయాలకే ప్రాధాన్యమిస్తున్నారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్న కిషన్‌రెడ్డి దగ్గరుండి రాష్ట్రానికి చెందిన ఎంపీలను కేంద్రం వద్దకు తీసుకు వెళ్లే బదులు ఆయన ఒక్కరే కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌ను కలిశారు. సీఎం రేవంత్ జలశక్తి మం త్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్న ముందు రోజే కిషన్‌రెడ్డి ఆయనను కలవడం రాజకీయంలో భాగమే.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై విపక్ష చూపడం ఇది మొదటిసారి కా దు. దాదాపు ప్రతి కేంద్ర బడ్జెట్‌లోనూ తెలంగాణకు రిక్త హస్తమే చూపిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ రాష్ట్ర ప్రభు త్వం రూ.1.63 లక్షల కోట్ల ప్రతిపాదనలు పంపితే వాటిల్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. మూసీ పునర్జీవం, మె ట్రో రెండో దశ, బయ్యారం ఉక్కు కర్మాగా రం, నవోదయ విద్యాలయాల స్థాపన కోసం రాష్ట్రం వినతులను పట్టించుకోవ డం లేదు.

విభజన చట్టంలో హామీ ఇచ్చినట్లు ఏదేనీ ఒక నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐఐఎం, ఐటీఐఆర్ మంజూరు చేయలేదు. కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా, దాన్ని ఊరిస్తూ చివరికి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా ఏర్పాటు చేస్తున్నా ప్రజలకు సంతోషం లేదు. కోచ్ ఫ్యాక్టరీతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తే, ప్రస్తుత యూనిట్ లో ఫ్యాక్టరీ నిర్వహణలో అధిక శాతం ప్ర యివేట్ సంస్థలకు కట్టబెడుతుండడంతో అదో ప్రయివేట్ సంస్థగా మిలిగిపోనుంది.

ముఖం చాటేస్తున్న బీఆర్‌ఎస్

తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్నా కేసీఆర్ త మ కుటుంబసభ్యుల స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి కేంద్రం నుంచి దక్కాల్సిన ప్రాజెక్టులను రాబట్టలేక పోయారు. చట్టపరంగా ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోలేక పోయారు. రెండు దఫాల వారి పాలనలో చేసిన పలు అక్రమాలు, అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సాగిలపడ్డారు.

అధికారం కోల్పోయాక కూడా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకుండా కేంద్రంతో పోరాడుతుంటే బాధ్య తాయుతమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ సహకరించకుండా బీజేపీతో జత కడుతోంది.

బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే లక్ష్యంగా విజయవంతంగా కులగణన పూర్తి చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని కేంద్రానికి పంపి, ఆ బిల్లు చట్టబద్దత కోసం కేంద్రం తో పోరాడుతుంటే బీఆర్‌ఎస్ ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించి ఢిల్లీ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా చేస్తే బీఆర్‌ఎస్ ముఖం చాటేసింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్‌ఎస్ బాధ్యతా రాహి త్యంగానే వ్యవహరిస్తున్నాది.

దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానం గా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అడుగడుగునా వివక్షే చూపిస్తోంది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల జరిగిన పరిణామాలనే తీసుకోవచ్చు. ఎయిర్‌పోర్టుల ఏర్పాటులో పక్కనున్న ఆంధ్రప్రదే శ్‌పై ప్రేమ చూపిస్తున్న కేంద్రం తెలంగాణ పై వివక్ష చూపుతోంది.

ఏపీలోని తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టు భూసేకరణకు రూ.1.570 కోట్లు కేటాయించిన కేంద్ర ప్ర భుత్వం తెలంగాణలోని మామునూర్‌లో నిర్మించాలనుకున్న విమానాశ్రయానికి పైసా కూడా విదల్చలేదు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఏపీకి చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆ రాష్ట్రంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ మన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులకు లేకపోవడమే బాధాకరం. 

నిలదీయవలసిన సమయమిదే!

ఒక ఎయిర్‌పోర్టులోనే కాదు రోడ్డు, రై లు అన్ని రంగాల్లోనూ ఏపీతో పోలిస్తే తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమే అని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ వివక్ష చివరికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సాగడం దురదృష్టకరం. 2027 జులైలో జరగను న్న గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపులోనూ కేంద్రం తెలంగాణకంటే ఏపీపై మక్కువ చూపిస్తోంది. రెండు తెలు గు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. 

అయితే కేంద్రం తెలంగాణను పక్కన పెట్టింది. గోదావరి పుష్కరాల కోసం ఏపీకి రూ.94 కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసాకూడా ఇవ్వలేదు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరి స్తూ తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యా యం చేస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, సం ఘాలు మద్దతు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉం ది. ఈ వివక్ష ఇంకెన్నాళ్లు అన్ని ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే, భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం చేసిన వారమవుతాం.

వ్యాసకర్త సెల్: 9848174377